హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bathukamma: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడు రోజులే సద్దుల బతుకమ్మ వేడుకలు.. ఎందుకో తెలుసా..?

Bathukamma: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడు రోజులే సద్దుల బతుకమ్మ వేడుకలు.. ఎందుకో తెలుసా..?

వేములవాడలో ముగియనున్న బతుకమ్మ వేడుకలు

వేములవాడలో ముగియనున్న బతుకమ్మ వేడుకలు

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎక్కడైనా సద్దుల బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల్లో జరుగుతాయి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ (vemulawada) పట్టణంలో మాత్రం ఏడు రోజులే జరుగుతాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎక్కడైనా సద్దుల బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల్లో జరుగుతాయి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ (vemulawada) పట్టణంలో మాత్రం ఏడు రోజులే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉండగా పండుగ ఏడు రోజులే అయినా ఎంతో ఆర్భాటంగా నిర్వహించుకుంటామని ఇక్కడి మహిళలు చెబుతున్నారు.

  ప్రచారంలో ఉన్న కథ:

  ఆడపిల్ల కోసం రాజశాసనం: పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించే ఒక రాజుకు కూతురంటే అమితమైన ప్రేమ. ఆమెను వేములవాడకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. బతుకమ్మ పండుగ రావడంతో కూతురినీ అల్లుడినీ ఇంటికి పిలిపించాడు. అయితే 'వేములవాడలో కూడా బతుకమ్మ ఉంటుంది కదా...అక్కడ ఆడకుండా పుట్టింటికి ఎందుకు రావాలి' అని కూతురు అందట. దీంతో వేములవాడ ప్రాంతంలోని కోడళ్లంతా ఏడు రోజులే బతుకమ్మ ఆడాలనీ..మిగతా రెండు రోజులూ పుట్టింట్లో వేడుక జరుపుకోవాలనీ శాసనం చేశాడట ఆ రాజు. ఆయన ఆజ్ఞమేరకు మహిళలంతా సద్దుల బతుకమ్మ సమయానికి పుట్టింటికి చేరారట. ఆనాటి నుంచి వేములవాడ, చుట్టు పక్కల ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు. కూతురి కోసం ఈ తండ్రి చేసిన శాసనం తండ్రీ కూతుళ్ల ప్రేమకు గుర్తుగా చరిత్ర పుటల్లో చెరిగిపోనిది.!

  ఇది చదవండి: జిల్లాలో మొట్టమొదటి సౌండ్ అండ్ లైటింగ్ సప్లయర్.., ఇప్పటికీ దసరా ఉత్సవాలంటే గుర్తొచ్చేది ఆయనే

  ఇక్కడి ఆడపడుచులు వేములవాడలో జరిగే ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని...అత్తవారిళ్లకు, తల్లిగారిళ్లకు తొమ్మిది రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళుతుంటారు. పుట్టినింట్లో మెట్టినింట్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మహిళలు చెబుతున్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆవరణలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ నేపథ్యంలో కోలాటాలు,బతుకమ్మ ఆటపాటలతో సందడిగా మారుతుంది. వేములవాడ పట్టణంలో ఊరూవాడా బతుకమ్మ శోభతో కనువిందు చేస్తోంది. మహిళలు ముత్తైదువులు బతుకమ్మ ఆడిపాడారు.

  ఇది చదవండి: అడవిలో సివంగులు: మావోయిస్టు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ 

  తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఉచిత చీరలను పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆహ్వానం మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రానున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bathukamma 2022, Local News, Telangana, Vemulawada

  ఉత్తమ కథలు