Home /News /telangana /

RAJANNA SIRCILLA ONE KILLED IN ROAD ACCIDENT IN RAJANNA SIRCILLA DISTRICT SNR RKH BRV

Rajanna Sircilla: అత్తారింటికి వెళ్దామని ముచ్చట పడ్డాడు .. ఇంతలోనే ఎవరూ ఊహించని సంఘటన

(Siricilla road accident)

(Siricilla road accident)

Rajanna Siricilla: ముస్తఫానగర్‌కు చెందిన చిలుక చక్రపాణి (51) ఆదివారం తన ద్విచక్ర వాహనంపై గోరింటాలలోని అత్తగారింటికి బయలుదేరాడు. గోరింటాల శివారులోని సాయిబాబా గుడి మూలమలుపు వద్ద ఆర్టిసి బస్సు చక్రపాణి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
    (K.Haribabu,News18, Rajanna siricilla)
    అత్తారింటికి వెళ్తూ ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో జరిగింది. ఎస్సై బొజ్జా మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..ముస్తఫానగర్‌(Mustafanagar)కు చెందిన చిలుక చక్రపాణి (Chiluka Chakrapani)ఆదివారం(Sunday)తన ద్విచక్ర వాహనంపై గోరింటాలలోని అత్తగారింటికి బయలుదేరాడు. గోరింటాల శివారులోని సాయిబాబా గుడి మూలమలుపు వద్ద ఆర్టిసి బస్సు చక్రపాణి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రపాణి తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు, బంధువులు సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్, సిఐ మొగిలి.. సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేసిన వారికి సర్దిచెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

    CM KCR | I-Day : నేటి నుంచి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. 2వారాల షెడ్యూల్ ఇదే: సీఎం కేసీఆర్



    అత్తారింటికి వెళ్తూ..
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని మూడుగుండ్ల వద్ద వాహన తనిఖీ చేపట్టగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని పట్టుకుని కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్య నేరమని, చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా ఉపేక్షించబోమని ఎస్సై హెచ్చరించారు.



    రెండు కార్లు నుజ్జు నుజ్జు ..
    రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సిరిసిల్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన సయ్యద్ ఖాన్, కామారపు రవి మరియు అతని భార్య... తమ కారులో హైదరాబాద్ వెళ్లి ఆదివారం తెల్లవారుజామున సిరిసిల్లకు వస్తున్నారు. ఆ సమయంలో తంగళ్ళపల్లికి చెందిన నాగరాజు మరో కారులో సిరిసిల్ల నుంచి తంగెళ్ళపల్లికి వస్తున్నాడు. ఈక్రమంలో రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు కార్లు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. సయ్యద్ ఖాన్ కాలుకు బలమైన గాయం కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. సయ్యద్ ఖాన్ తండ్రి భాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు