హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం : సీఐ మొగిలి

Rajanna Siricilla: ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం : సీఐ మొగిలి

X
వివరాలు

వివరాలు తెలియజేస్తున్న పోలీసులు

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో దొంగలించబడ్డ 3 ద్విచక్రవాహనాలు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు సిఐ మొగిలి తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : హరి

లొకేషన్ : రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో దొంగలించబడ్డ 3 ద్విచక్రవాహనాలు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు సిఐ మొగిలి తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడ్డాయని, ప్రజలు వారి గృహాల వద్ద వారి గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు.

దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దొంగల వద్ద నుంచి 1లక్ష 40వేలు రికవరీ చేసినట్లు తెలిపారు. మూడు ద్విచక్ర వాహనాలు చోరీ చేయగా అందులో రెండు సిద్దిపేటలో, ఓ బైకు గంభీరావుపేట పెద్దమ్మ స్టేజీ వద్ద అపహరించినట్లు పోలీసులు గుర్తించారు.

జనవరి 26వ తేదీన సెంట్రింగ్ సీట్స్ దొంగిలించారని ఫిర్యాదు వచ్చిందని దాన్ని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ వాహన తనిఖీల్లో భాగంగా ఆటోను తనిఖీ చేయగా అందులో 26వ తేదీన ఇచ్చిన కంప్లైంట్ లో పోయిన వస్తువులు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే దొంగిలించామని ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సిఐ మొగిలి మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు విధిగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 ఉపయోగించుకోవాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేకమైన పనులు జరిగితే విధిగా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు