హోమ్ /వార్తలు /తెలంగాణ /

శివరాత్రిని మర్చిపోయారా.. ఏర్పాట్ల సంగతేంటి..?

శివరాత్రిని మర్చిపోయారా.. ఏర్పాట్ల సంగతేంటి..?

రాజన్న ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లపై నిర్లక్ష్యం

రాజన్న ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లపై నిర్లక్ష్యం

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Temple) వారి ఆలయంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు భక్తులు. మహా శివరాత్రి జాతర రాగానే ఎన్నో లక్షలు వెచ్చించి తాత్కాలికంగా అనేక మౌలిక వసతులు సౌకర్యాలు భక్తులకు కల్పిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Temple) వారి ఆలయంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు భక్తులు. మహా శివరాత్రి జాతర రాగానే ఎన్నో లక్షలు వెచ్చించి తాత్కాలికంగా అనేక మౌలిక వసతులు సౌకర్యాలు భక్తులకు కల్పిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాటిని తర్వాత కూడా పర్యవేక్షించకపోవడం శోచనీయం!?. ఇప్పటికైనా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధికారులతో పాటు ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించి తాత్కాలిక పనులు కాకుండా భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులను చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి సేవలో తరించేందుకు భక్తుల అధిక సంఖ్యలో వస్తుంటారు. అర్చకులు, వేద పండితులు ప్రతి రోజు స్వామి వారితో పాటు పరివార దేవతలకు పూజ కార్యక్రమాలు చేస్తున్నారు.

పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి సేవలో తరిస్తున్నారు భక్తులు. దేవాలయాల్లో ఎక్కడ కూడా కోడె మొక్కులు చెల్లించుకోవడం లేదు. కోడె మొక్కులు చెల్లించుకోవడం శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ప్రత్యేకత అనే చెప్పాలి. కోడె మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పేదల పెన్నిధిగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా రాజన్న ఆలయం ప్రసిద్ధి. స్వామివారి ఆలయానికి సింహ భాగ ఆదాయం కోడె మొక్కుల ద్వారానే వస్తోంది.

ఇది చదవండి: ఈ యువతి పండిస్తున్న అరటితో లాభాలెన్నో.. ఇంతకీ ఏంటా రకం..!

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతర మహోత్సవం మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి తర్వాత రాజన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో అనేకసార్లు ప్రకటించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇటీవలే ఎమ్మెల్యే రమేష్ బాబు తో పాటు కలెక్టర్ అనురాగ్ జయంతిలు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. మహాశివరాత్రి జాతర నాటికి పలు అభివృద్ధి పనులు పట్టణంలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ బాబు, మంత్రి కేటీఆర్ లు అనేకసార్లు అభివృద్ధి పనులను పరిశీలించిన వెళ్లారు. అయినప్పటికీ పనులలో పురోగతి మాత్రం లేదు.

First published:

Tags: Local News, Siricilla, Telangana, Vemulawada