హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: పింఛన్లు ఇవ్వమంటే సవాలక్ష కొర్రీలు పెడుతున్న అధికారులు

Rajanna Siricilla: పింఛన్లు ఇవ్వమంటే సవాలక్ష కొర్రీలు పెడుతున్న అధికారులు

చనిపోయిన వ్యక్తి పేరు మీద మోసం

చనిపోయిన వ్యక్తి పేరు మీద మోసం

RajanaSiricilla: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల కోసం ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ పథకం లక్ష్యం నీరుగారుతోందనే చెప్పాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల కోసం ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ పథకం లక్ష్యం నీరుగారుతోందనే చెప్పాలి. వయో వృద్ధులు, వికలాంగులు వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిరుపేదలు ఈ పింఛన్ పొందాల్సి ఉంది. అర్హులకు పింఛన్లు ఇవ్వమంటే అధికారులు కొర్రీలుపెడుతున్నారు. పెన్షన్లు పక్కదారి పడ్తున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.

ఆసరా ఫించను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సాయినగర్ లో గతంలో ఒక వ్యక్తికి ఆసరా ఫించన్ వస్తుండేది. కానీ అతను చనిపోయిన తర్వాత కూడా అతని స్థానంలో వేరొక వ్యక్తి ఫోటో, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాను మున్సిపల్ కార్యాలయంలో ఆన్లైన్ నమోదు చేశారు. చనిపోయిన తర్వాత కూడా 8 నెలలుగా వేరొక వ్యక్తి(ప్రజాప్రతినిధి) పేరిట ఖాతాలో జమ అయినట్లు అప్పుడు అధికారులు గుర్తించి తొలగించారు.

ఇప్పుడు కూడా అదే సాయినగర్ లో చెట్టి మంగ అనే మహిళకు 2016లో బీడీ కార్మికురాలిగా ఆసరా పింఛన్ అందించారు. రెండు నెలలుగా ఆమె ఖాతాలో జమ అయిన తర్వాత అధికారులు బందు చేశారు. చెట్టి మంగ ఈమె ఆధార్ నంబర్ తో మరో మహిళ నల్ల హారిక అనే పేరును ఆసరా పింఛనులో నమోదు చేసి మంగ బ్యాంకు ఖాతాలో ఆసరా పించను జమచేశారు. చెట్టి మంగ బ్యాంకు ఏటీఎం కార్డు మా వద్ద లేదని ఈమె భర్త చెట్టి చంద్రం బ్యాంకు నుండి మాకు తెలియకుండానే ఎవరో ఎటిఎం ద్వారా డ్రా చేస్తున్నారని ఆరోపించాడు. చెట్టి చంద్రం పుట్టిన తేదీ ఆధార్ కార్డులో 1975 ఉంటే మున్సిపల్ కార్యాలయంలో 1967 అని నమోదు చేసి వయోవృద్ధుల పింఛను అతనికి తెలియకుండానే 2016లో మంజూరైనట్లు తెలిపాడు.

నాలుగున్నర సంవత్సరాలుగా నా ఆంధ్రబ్యాంకు (యూనియన్ బ్యాంకు) ఖాతాకే జమవుతున్నాయని అధికారులు తెలిపారు. నాకు చదువు రాదని, సంతకం కూడా పెట్టడం రాదని అన్నాడు. నాపేరుతో ఎవరో సంతకం పెట్టి ఏటీఎం కార్డు తీసుకున్నారని అంటున్నాడు. నా ఏటీఎంతో వేరే వ్యక్తి ఎవరో ప్రతినెలా డ్రా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

నా భార్య చెట్టి మంగ సెకండ్ వేవ్ కరోనా టైంలో కరోనా సోకి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో మరణించింది. మరణించిన తర్వాత కూడా ఆరు నెలల వరకు ఆసరా ఫించను ఏటిఎం ద్వారా ఎవరో డ్రా చేశారని తెలిపారు. ఇదే విషయమై సిరిసిల్ల మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం కింద నా భార్య ఆధార్ నెంబర్లో నల్ల హారిక అనే వ్యక్తి పేరిట పించన్ వస్తుందని దరఖాస్తు చేశానని ఇప్పటివరకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఆఫీసు చుట్టూ తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సిరిసిల్ల గాంధీ చౌక్లో గల ఎస్బిఐ బ్యాంకులో నా భార్య పేరు ఉన్న అకౌంట్ స్టేట్మెంట్ కోసం బ్యాంకుకు దరఖాస్తు మూడుసార్లు ఇచ్చినా తీసుకోలేదని అన్నాడు. ఖాతాలో డబ్బులు లేవని వెయ్యి రూపాయలు జమ చేయమన్నారు.

జమ చేసిన రశీదు, ఫ్యామిలీ సర్టిఫికెట్, నా ఆధార్ కార్డు జిరాక్సు, నా బిడ్డ ఆధార్ కార్డు జిరాక్సు పెట్టినా కూడా స్టేట్మెంట్, ఖాతాకు నామిని ఎవరు ఉన్నది. ఎక్కడి నుండి డ్రా చేస్తున్నారని చెప్పమంటే బ్యాంకు అధికారులు చెప్పడం లేదని అంటున్నాడు. జిల్లా ఆసరా ఫించన్లు ఇచ్చే అధికారిని నల్ల హారిక భర్త పేరు ఎవరు ఉన్నారని చెప్పమంటే సమాచార హక్కు చట్టం మున్సిపల్ పెట్టమని ఉచిత సలహా ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అర్హులైన ఆసరా ఫించన్లు చాలామంది అర్హులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వారికి రాకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సొమ్ము పక్కదారి పట్టకుండా అధికారులు పర్యవేక్షించి పేదల సొమ్ము తినే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana