Haribabu, News18, Rajanna Sircilla
తెలంగాణ (Telangana) లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Rajanna Temple) వారి దర్మసత్రాలు లాడ్జిలను తలపిస్తున్నాయి. రాజన్న ఆలయంలోని ధర్మ సత్రాల్లో మందు, మాంసం వండరాదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ ఆలయ ధర్మ సత్రాల్లో మాత్రం.. యదేచ్చగా మందు, మాంసం, విందులు, వినోదాలు జోరుగా సాగుతున్నాయి. రాజన్నను దర్శించుకోవడానికి రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాలనుంచి, దేశ నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. రాజన్న వసతి గదుల్లో ఉండే భక్తులు భక్తి శ్రద్దలతో ఉండాలన్న భావనతో.. వసతి గృహాల్లో మద్యం తాగడం గాని,మాంసం వండుకోవద్దని నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ నిబంధనలను ఆలయ అధికారులు అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
భీమేశ్వర ఆలయం పక్కనున్న గెస్ట్ హౌస్ ను తీసుకున్న కొందరు భక్తులు మాంసాన్ని కోయడాన్ని పక్కనే ఉన్న మరికొంతమంది భక్తులు ఆక్షేపించారు. నిబంధనలకు విరుద్ధంగా వసతి గృహాన్ని తీసుకున్నా కూడా దేవాలయంలో ఉన్నటువంటి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో అనేక సార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా ఆలయ ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు భక్తుల మనో భావాలు కాపాడాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు, హిందూ సంఘాలు కోరుతున్నాయి.
శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో తెలంగాణ దేవాదాయ ధర్మాదాయశాఖ చట్టం 30/87 సెక్షన్ 23 (4) ప్రకారం దేవాలయం ప్రాంతాల్లో, ధర్మశాలలలో మత్తు పదార్ధములు సేవించుట గానీ, జంతుబలి చేయుట గానీ, మాంసం వండుకొనుట గానీ, జూదం ఆడుట, సిగరెటు, బీడి, కల్లు సేవించుట నేరముగా భావించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆలయ ఉన్నతాధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. కానీ అవి మాత్రం అమలు కావడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని హిందూ సంఘాలు, భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రతిష్టను కాపాడాల్సిన ఆలయ అధికారులే చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు నిబంధనలు పక్కగా అమలు చేస్తూ ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు వేడుకుంటున్నారు. రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంతో పాటు, శంకర్ మఠం పక్కనే భీమేశ్వర సదన్, గెస్ట్ హౌస్ తీసుకున్న భక్తులు మాంసాన్ని కోశారు. మాంసాన్ని కోసిన భక్తులు ఆలయ ఉద్యోగికి సంబంధించిన బంధువులని తెలుస్తోంది. ఈవో కృష్ణ ప్రసాద్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana, Vemulawada