హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: గురుకులంలో ఉండాల్సిన వాళ్లు చెరువుగట్టుపై.. ఏకలవ్య స్కూళ్లలో ఏం జరుగుతోంది..?

Telangana News: గురుకులంలో ఉండాల్సిన వాళ్లు చెరువుగట్టుపై.. ఏకలవ్య స్కూళ్లలో ఏం జరుగుతోంది..?

X
ఏకలవ్య

ఏకలవ్య పాఠశాలలపై పర్యవేక్షణ కరవు

కనీస వసతులు,సౌకర్యాలు లేక ఇబ్బందుల్లో ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థులు..వెంటనే అధికారులు స్పందించి వారి భవిష్యత్తును కాపాలి... నోట్ బుక్స్,పాఠ్యాంశ పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉండటం శోచనీయం.. మరిమడ్లలో గల తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏకలవ్య గురుకుల పాఠశాలపై న్యూస్18 ప్రత్యేక కథనం అందిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R | Karimnagar | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

గిరిజన విద్యార్థులను ప్రతిభివంతులుగా తీర్చి దిద్దేందుకు, చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసెందుకు, ఐఐటి నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పోటీ పడేలా ఏకలవ్య గురుకుల పాఠశాలలను ప్రారంభించింది (Central Governament) కేంద్ర ప్రభుత్వం. ఎన్నో తరాలుగా.. ఎదుగుదలకు నోచుకోని గిరిజన బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించి గొప్పవారు అవుతారని, తమని సాకుతారని ఆశపడి ఎంతో కష్టపడి పిల్లలను తల్లిదండ్రులు, స్కూల్స్ కు, హాస్టల్ పంపితే హాస్టల్లో పట్టించుకునే వారే లేక చెట్ల వెంబడి పుట్టల వెంబడి తిరుగుతూ...న్యూస్ 18 కెమెరాకు విద్యార్థులు చిక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla) వేములవాడ (Vemulawada) నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం మరిమడ్లలో గల (Telanagana State) ఏకలవ్య గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

ఏకలవ్య గురుకుల పాఠశాలలో 418 మంది విద్యార్థులు ఉండగా దాదాపు 20కి పైగా సిబ్బంది ఉన్న ఏ ఒక్కరూ కూడా అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ముందుగానే వినిపిస్తున్నాయి .అందుకే విద్యార్థులు బయటకి తిరుగుతున్నారని తెలుస్తోంది. పర్యవక్షణ కొరబడిందని, వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ఇది చదవండి: ఎదురు పిల్ల పండుగ..! పేరులాగే పండగ కూడా చాలా డిఫరెంట్.. ఎక్కడంటే..!

ఉమ్మడి కరీంనగర్ (Karimnagar), మహబూబ్ నగర్ (Mahbumnagar), నిజామాబాద్ (Nizamabad), నల్గొండ (Nalgonda), హైదరాబాద్ (Hyderabad) ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. గిరిజన విద్యార్థుల బాగా చదువుకోవాలనే సదుద్దేశంతో (CBSE) సిబిఎస్ఇ సెలెబెస్ తో విద్యాబోధన, నాణ్యమైన వసతులు, పౌష్టికాహారంతో కేంద్రం ఏకలవ్య గురుకుల పాఠశాలలు ప్రారంభించినప్పటికి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడున్న గురుకుల పాఠశాల సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారిందనే చెప్పకనే చెబుతున్నాయి ఇక్కడి దృశ్యాలు.

ఇది చదవండి: జీతాల చెల్లింపులో గందరగోళం.. టీచర్ల వేతనాల కోత

ఏకలవ్య గురుకుల పాఠశాలకు వెళ్ళెందుకు దాదాపు కిలో మీటరు వరకు దారి సరిగ్గా లేకపోవడంతో,వర్షాకాలంలో విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో అనేక సార్లు పలు విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష నాయకులు ధర్నా నిరసన కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే.హస్టల్ లో బాత్రూంలకి డోర్లు కుడా సరిగ్గా లేవు. పైప్ లైన్ వాటర్ లీకేజీలతో నీరు వృధాగా పోతోంది. చదువుకోవాల్సిన పిల్లలు స్మార్ట్ ఫోన్లలో సినిమాలు చూస్తూ.. సమయం వృధా చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మరి కొంతమంది విద్యార్థులైతే.. చెరువు వైపు వేళ్తుండగా వారిని ప్రశ్నించగా వాష్ రూమ్ కి వెళ్తున్నాం అంటూ సమాధానం ఇచ్చారు. కొంతమంది విద్యార్థులు కెమెరాను చూసి పరుగులు తీయసాగారు. విద్యార్థులు ఉండే రూమ్స్ కి కొన్నింటికి అయితే తలుపులు కుడా లెకుండా దర్శనమిస్తున్నాయి.

ఇది చదవండి: స్కూళ్లను బస్సు, హెలికాఫ్టర్‌లా మార్చేసిన చిత్రకారుడు

ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా అధికారుల పర్యవేక్షణ కరువై నాణా సమస్యలతో ఏకలవ్య గురుకుల పాఠశాల సమస్యల వలయంగా కన్పిస్తుంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పాఠశాలను సందర్శించాలని విద్యార్థులతో పాటు ప్రజలు,వివిధ పార్టీల నాయకులు సైతం కోరుతున్నారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు న్యూస్18తో మాట్లాడుతూ.. తాము ఆ రొడ్డుగుండే వెళ్తామని పిల్లలు ఎప్పుడూ చెట్లవెంబడే కనిపిస్తారని,ఆ అడవిలో క్రూర జంతువులు తిరుగుతుంటాయని, దగ్గర్లో ఓ వ్యక్తి పై చిరుత దాడి చేయగా అతను చాకచక్యంగా తప్పించుకోని ప్రాణాలు కాపాడుకున్నాడని చెప్పాడు ప్రయాణికుడు.

ఇది చదవండి: శ్రీమంతులు అంటే వీళ్లే.. చదువు చెప్పిన బడి కోసం ఏం చేశారో చూడండి..!

లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బానోతు నరేష్ మాట్లాడుతూ... స్కూల్ కు సంబంధించిన భూమి ఆక్రమణకు గురవుతుందని,కంపోడ్ వాల్ నిర్మిస్తున్న మధ్యలోనే అపేశారన్నారని, చిరుత పులులు సంచరిస్తున్న అడవి కాబట్టి కంపౌడ్ వాల్ త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వాష్ రూమ్ లు బాగోలేవంటూ పిల్లలు బయట తిరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ పాఠశాలకు వచ్చినప్పుడు స్కూల్ వరకు రోడ్డు నిర్మిస్తామని చెప్పిన ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదని, స్కూల్ కు సంబంధించిన భూమి సర్వే చేసి హద్దులు చూపించాలని డిమాండ్ చేశారు.

గిరిజన పాఠశాలలని పేరు చెప్పడానికే గొప్ప తప్ప పట్టించుకునే నాథుడే లేక మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరిమడ్ల గురుకుల పాఠశాల అధ్వానంగా తయారైంది.పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఏ మాత్రం పట్టించుకొక పోవడంతోనే విద్యార్థులు క్రమశిక్షణగా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారనే ఆరోపణలు ముందుగానే వినిపిస్తున్నాయి. విద్యార్థులకు ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుసుకొని విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలు వేసేలా తీర్చి దిద్దుతారని News 18 ఆశిస్తోంది.

First published:

Tags: Local News, Siricilla, Telangana

ఉత్తమ కథలు