Home /News /telangana /

RAJANNA SIRCILLA NEW COMPLICATIONS WITH HEIFER CALVES OFFERED BY DEVOTEES AT RAJANNA TEMPLE

Rajanna Sircilla: రాజన్నకు లోపాలతో ఉన్న కోడెలను ఇస్తున్న భక్తులు: భక్తుల తీరుతో కొత్త చిక్కులు 

వేములవాడ

వేములవాడ రాజన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా ఒక మొక్కు ఉంది. అదే కోడె మొక్కు. రాజన్న భక్తులు స్వామి వద్ద తాము కోరిన కోరికలు తీరిన అనంతరం కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకొని

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    K.Haribabu, News 18, Rajanna Sircilla

    Rajanna Sircilla: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా ఒక మొక్కు ఉంది. అదే కోడె మొక్కు. రాజన్న భక్తులు స్వామి వద్ద తాము కోరిన కోరికలు తీరిన అనంతరం కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకొని...స్వామి వారికి ఒక కోడె దూడను మొక్కు రూపంలో చెల్లించుకుంటారు. భక్తులు సమర్పించిన ఆ కోడెలను ఆలయ అనుబంధ గోశాలకు తరలించి సంరక్షిస్తుంటారు. భక్తులు స్వామి వారికీ సమర్పించే ఈ కోడెల విషయంలో కొన్ని నిష్ఠలు ఉన్నాయి. పూర్తి ఆరోగ్యకరమైన, పాలు తాగడం మానిన, దేశవాళీ కోడెలను మాత్రమే భక్తులు రాజన్నకు సమర్పించాల్సి ఉంటుంది.

    అయితే ఇటీవలి కాలంలో భక్తులు ఈ నిష్ఠను మరిచి ఇష్టారీతిలో కోడె దూడలను ఆలయానికి తీసుకొస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల ఆలయ అధికారులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.

    లోపాలు ఉన్న కోడెలను సమర్పిస్తున్న భక్తులు:
    రాజన్నకు మొక్కు తీర్చుకునే విషయంలో భక్తులు కొంత అవగాహనా లోపంతో వ్యవహరిస్తున్నారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కోడె దూడలను తీసుకోచ్చేటప్పుడు, పాలు మరువని లేగ దూడలను, చిక్కిపోయిన, అనారోగ్యం బారిన పడిన జెర్సీ ఆవులను తెస్తున్నారు. దానికి తోడు...వాటిని ఆటో ట్రాలీలో తీసుకొస్తున్న సమయంలో దెబ్బలు తగిలి అవి అనారోగ్యానికి గురవుతున్నాయి. వీటిని స్వామి వారికి సమర్పించడం ద్వారా రాజన్న ఆలయ గోశాలలో ఉన్న గోవులకు, కోడెలకు, గోశాల సిబ్బందికి ఇబ్బందిగా మారుతున్నాయని ఆలయ గోశాల పర్యవేక్షకుడు నరసింహమూర్తి అంటున్నారు. పాలు మరువని, అనారోగ్యం పాలైన లేగ దూడలను ఇవ్వడం ద్వారా అవి కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జెర్సీ ఆవులను, పాలు మరవని లేగ దూడలను మొక్కుబడిగా ఇవ్వద్దంటూ ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేసి భక్తులకు పలుమార్లు అవగాహన చేసే ప్రయత్నం చేశారు.

    భక్తుల పేరుపై కోడెను సమర్పించే సదుపాయం:
    రాజన్నకు కోడెలను సమర్పించే భక్తులు వాటిని సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చే బదులు, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో నిజ కోడె అనే టికెట్(1,116/-) ఉంటుంది. దానిని తీసుకుంటే ఆలయ గోశాల నుంచి ఓ కోడె దూడను భక్తుల పేరుపై అందిస్తారు. తద్వారా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవచ్చని, ఆలయానికి సైతం ఆదాయం సమకూరుతుందని ఆలయ అధికారులు భక్తులకు వివరించారు. ఆలయంలో నిజ కోడె టికెట్ ద్వారా స్వయంగా గోశాల నుంచి కోడెనిచ్చి స్వామివారికి సమర్పించుకునే వేసులుబాటు ఉందని, దీనిని భక్తులు దృష్టిలో ఉంచుకొని ఉపయోగించుకోవాలని వేములవాడ రాజన్న గోశాల పర్యవేక్షకులు గుండు నరసింహమూర్తి సూచిస్తున్నారు.

    గోశాలలో కోడెలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారికి సింహ భాగంగా (అధిక మొత్తంలో) ఆదాయం కోడె మొక్కుల రూపేనా వస్తున్న విషయం తెలిసిందే. భక్తులు సంతల్లో లేగ దూడలను కొనడం ద్వారా ప్రయోజనం లేదని... అక్కడి నుంచి వచ్చే లేగ దూడలు ఆహారం తినక, బక్క చిక్కి అనారోగ్యం బారిన పడుతున్నాయని వాటిని స్వామివారికి సమర్పించడం ద్వారా గోశాలలో మిగతా ఆరోగ్యంగా ఉన్న కోడెలకు ఇబ్బందిగా మారుతుందని విజ్ఞప్తి చేశారు. పాడి సంపద ఉంది ఇంట్లో పెంచుకుంటున్న కోడెలను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కోడెలను స్వామివారికి సమర్పించడం ఉత్తమమైనదే కానీ... సుదూర ప్రాంతాల నుంచి రావడంతో అనారోగ్యం పాలవుతున్నాయని ఆలయ గోశాల అధికారులు చెబుతున్నారు.

    శ్లో॥ వాహనం తే భవిష్యామి సదాహంపార్వతీపతే! వాహనం భవమే ధర్మ సర్వదాలోకపూజితః॥

    Read This also: Nagarkurnool: ప్రభుత్వం ముందుచూపుతో చేసిన ఆ పనే.. ఇపుడు గర్భిణీల పాలిట వరమైంది..



    నిజకోడెను సమర్పించు భక్తులకు విజ్ఞప్తి:
    దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో 'ధర్మదేవత' స్వరూపమై కోడెల రూపంలోప్రతినిత్యం భక్తులచే పూజలందుకుంటుంది. శ్రీరాజరాజేశ్వర స్వామివారికి నిజకోడెలను సమర్పించే విషయంలో వేదం చెప్పిన ప్రకారం ఆశిప్టో దృఢిష్ణో బలిష్ఠ ఆరోగ్యమైనవి, దృఢమైన బలము కలిగిన వాటిని మాత్రమే సమర్పిస్తే బహు పుణ్యము కలుగును.
    1) జర్సీ కోడెలు
    2) పాలు మరువని కోడెలు
    3) అనారోగ్యమైన కోడెలు
    4) అంగవైకల్యం కలిగిన కోడెలు
    5) వాతావరణమునకు అనుకూలించని కోడెలు
    రాజన్నకు సమర్పిస్తే..దోషం వస్తోందని, కావున ఆ కోడెలను స్వీకరించబడవని భక్తులు గమనించి సహకరించాలని అన్నారు.

    గమనిక: నిజకోడెను సమర్పించాలనుకునే భక్తులు ఆలయంలో రూ. 1,116/- టికెట్ తీసుకుంటే...గోశాలలో ఉన్న బలిష్టమైన కోడెను తీసికొచ్చి మీచే సమర్పించు అవకాశమును కల్పించారు. ఈ అవకాశమును భక్తులు వినియోగించుకోగలరని ఆలయ గోశాల పర్యవేక్షకుడు నరసింహమూర్తి తెలిపారు. గోశాల సంప్రదించు ఫోన్ నెంబర్ 08723-236040, ఆఫీస్: 08723-236018.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Devotional, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు