Home /News /telangana /

RAJANNA SIRCILLA NAMPALLY SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE HOLY POND IS DAMAGING ABH BRV RKH

Rajanna Sircilla: ఈ కోనేరులో మునిగితే ఒకప్పుడు పుణ్యతీర్థం, ఇప్పుడు మునిగితే సర్వరోగాలు అంటుకుంటాయి

అపరిశుభ్రంగా

అపరిశుభ్రంగా నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కోనేరు

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అసౌకర్యాలు భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆలయ కోనేరుతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అసౌకర్యాలు భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆలయ కోనేరుతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ కోనేరు చెత్త, మురుగు నీటితో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. గతంలో స్వామి వారి దర్శనానికి ముందు కోనేరులో స్నానం ఆచరించే భక్తులు..ప్రస్తుతం కోనేరు పరిస్థితి అద్వాన్నంగా మారడంతో అటువైపు వెళ్లడానికే సంకోచిస్తున్నారు. చెత్తాచెదారంతో నిండిపోయిన కోనేరును పట్టించుకున్న నాధుడే కరువయ్యారని నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    రాజన్న ఆలయానికి అనుబంధంగా:
    దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ధర్మగుండంగానీ, కోనేరులో గాని పుణ్యస్మానాలు ఆచరిస్తే రోగాలు ధరిచేరవని భక్తులు విశ్వసిస్తారు. కోనేటి స్నానం తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు.

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి వారు పెరుమాల్లుగా నాంపల్లి గుట్టపై కొలువై ఉన్నాడు. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గొప్ప పర్యాటక కేంద్రంగానూ ఈ ప్రాంతం ప్రాచుర్యంలో ఉంది. అయితే ఆలయంలో నిర్వహణ సరిగా లేకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి కోనేరులో నీరు పూర్తిగా పచ్చగా మారి.. తాకితేనే రోగాలు వస్తాయా? అన్నంతలా పాచిపేరుకుపోయింది. వెంటనే దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు స్పందించి కోనేరును శుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.



    ఆలయంలో అరకొర సౌకర్యాలు:
    రాజన్న క్షేత్రంతో పాటు నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి వారికి ఏటా రూ. కోట్లలో ఆదాయం వస్తున్నా అభివృద్ధి విషయంలో మాత్రం ఈ ఆలయాన్ని విస్మరిస్తున్నారు అధికారులు. కనీసం భక్తుల కోసం రక్షిత మంచి నీరు, మూత్రశాలలు లేకపోవడం శోచనీయం. మరుగుదొడ్లు మూత్రశాలాలూ లేకపోవడంతో నాంపల్లి గుట్ట పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతుందని భక్తులు చెబుతున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇక్కడే వంట వార్పు చేసుకుంటుంటారు. ఈక్రమంలో ఆలయ పరిసరాల్లో సరైన సౌకర్యాలు లేవని, చెట్ల కిందనే వంట చేసుకుంటున్నామని, చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు భక్తులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి భక్తుల కోసం వంటగదులను, ఎండావానల నుంచి రక్షణగా షెల్టర్స్ ఏర్పాటు చేయాలని లక్ష్మీనరసింహ స్వామి భక్తులు కోరుతున్నారు.



    కరీంనగర్ - సిరిసిల్ల రోడ్డులో వేములవాడ 2వ కమాన్ గుండా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.ఆలయంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.

    Read This; Rajanna Sircilla: అనారోగ్యంతో చికిత్స పొందుతూ బీజేపీ సీనియర్ నేత ఎర్రం నర్సయ్య మృతి
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Devotional, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు