హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: వాళ్ళు నాటుతున్నారు, వీళ్ళు నరికేస్తున్నారు.., హరితహారం చెట్ల విషయంలో అయోమయం

Rajanna Siricilla: వాళ్ళు నాటుతున్నారు, వీళ్ళు నరికేస్తున్నారు.., హరితహారం చెట్ల విషయంలో అయోమయం

సిరిసిల్లలో

సిరిసిల్లలో హరిహారం చెట్లకు ముప్పు

తెలంగాణ (Telangana Government) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం (Haritha Haram) కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ శివారుతో పాటు పట్టణంలోని బైపాస్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు మునిసిపల్ అధికారులు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  తెలంగాణ (Telangana Government) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం (Haritha Haram) కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ శివారుతో పాటు పట్టణంలోని బైపాస్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు మునిసిపల్ అధికారులు. గతంలో నాటిన ఈ మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. దీంతో బైపాస్ ప్రాంతాలు హరితవనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కనివిందు చేస్తున్నాయి. అయితే ఆ పచ్చదన్నాని పట్టణ వాసులు ఆస్వాదించేలోగా సెస్ అధికారులు చెట్లను నరికివేస్తున్నారు. విద్యుత్ తీగలకు చెట్లు అడ్డొస్తున్నాయని ఎక్కడికక్కడే చెట్లను నరికేస్తున్నారు సెస్ అధికారులు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

  విద్యుత్ తీగల కిందే మొక్కల పెంపకం: ప్రతి ఏటా విద్యుత్ తీగల కిందే మొక్కలు నాటడం.. అవి వృక్షాలుగా మారిన అనంతరం విద్యుత్ మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా ఆ చెట్లను, కొమ్మలను సెస్ అధికారులు నరికివేయడం పరిపాటిగా మారింది. విద్యుత్ అవరోధకాలుగా మారుతున్నాయనే నేపంతో సెస్ అధికారులు చెట్లను, చెట్ల కొమ్మలను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారని..వేములవాడ పట్టణంలో ఈ దృశ్యాలు నిత్య కృత్యంగా మారాయని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు అన్నారు. దీంతో పర్యావరణ ప్రేమికులతో పాటు వేములవాడ పట్టణ ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సెస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మొక్కలు నాటేందుకు స్థలాలను కేటాయించాలని కోరారు.

  ఇది చదవండి: విధి నిర్వహణ కోసం రోజూ 8 కి.మీ కాలినడకన.., అంగన్వాడీ టీచర్ ను మెచ్చుకోవాల్సిందే..!

  అధికారుల్లో కొరవడిన సమన్వయం: మున్సిపల్ మరియు సంబంధిత అధికారులకు ముందుచూపు లేకపోవడమే సమస్యకు కారణమని ప్రజలు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ తీగల కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరమించుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. హరితహారంతో పాటు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే ఇలా చెట్లను నరికి వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రభుత్వం సంకల్పించిన హరిత తెలంగాణ సాధ్యపడుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని రోడ్ల ఇరువైపులా పచ్చని హరితహారం చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో దర్శనమిస్తున్నాయి. మామూలు నీడనిచ్చే మొక్కలు కాకుండా పండ్ల, పూల మొక్కలను సైతం నాటాలని, తద్వారా పశుపక్షాదులు, జీవరాశులకు ఫలాలు, ఆహారం లభిస్తుందన్నారు. ఊరు, గ్రామాల శివారుల్లో ఈ మొక్కలు నాటంతో జనావాసాల వద్ద కోతుల బెడద కూడా ఉండదనే చెప్పాలి. ఇప్పటికైనా మున్సిపల్, సెస్ అధికారులు సమన్వయంతో పనిచేసి హరితహారం మొక్కలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  ఉత్తమ కథలు