Home /News /telangana /

RAJANNA SIRCILLA MODERN LIBRARY THAT HAS BECOME AN ICON OF SIRICILLA SNR RKH NJ

Telangana: సిరిసిల్లలో సినారే స్మారక మందిరం..జ్ఞానసంపదను ఇస్తున్న మోడ్రన్‌ గ్రంధాలయం

సిరిసిల్లలోని

సిరిసిల్లలోని సినారే స్మారక మందిరం(లైబ్రరీ)

సిరిసిల్లలో అత్యాధునిక హంగులతో ఒక ప్యాలెస్ ను తలపించేలా లైబ్రరీ నిర్మించారు. ఈ లైబ్రరీ నిరుద్యోగులకు నాలెడ్జ్‌ హబ్‌..ఆధునిక విజ్ఞాన బాంఢాగారం..విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే చక్కని స్నేహితుడు లాంటిది. ఇంతకీ ఈ గ్రంథాలయం విశేషాలేంటంటే!

ఇంకా చదవండి ...
    (K.Haribabu,News18, Rajanna siricilla)
    చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం. ఇలా పుస్తకాల గురించి మనమెన్నో సూక్తులు విన్నాం. అలాంటి పుస్తకాలు కొలువై ఉండే గ్రంథాలయం ఓ దేవాలయం లాంటిది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో ఒక ప్యాలెస్‌ను తలపించేలా గ్రంథాలయాన్ని నిర్మించారు.

    సిరిసిల్ల ఐకాన్‌గా మారిన సినారే లైబ్రరీ..
    సిరిసిల్ల పట్టణంలో మోడ్రన్ లైబ్రరీ ఉంది. ఆసియాటిక్ లైబ్రరీ తరహాలో ఈ ఆధునిక హంగులతో మూడంతస్తుల భవనం నిర్మించారు. మంత్రి కేటిఆర్‌ చొరవతో ఈ భవనాన్ని మూడు కోట్ల యాభై లక్షలతో ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశారు. సిరిసిల్లలో ఐకాన్‌గా నిలుస్తున్న ఈ భవనం క్రింది అంతస్తులో మూడు రీడింగ్ గదులున్నాయి. మొదటి అంతస్తులో చైర్మన్, కార్యదర్శి రూములతోపాటు విశాలమైన మీటింగ్‌ హాల్‌, టాస్క్ శిక్షణ సంస్థ క్లాస్ రూములు, ఆఫీసును ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతుల కోసం గదులు, కంప్యూటర్ శిక్షణ కొరకు ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడైన ఉద్యమకారుడు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరీ శంకరయ్య ప్రత్యేక కృషితో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సాధ్యమైంది.

    విద్యార్థులకు విద్యానిలయం..
    గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఆశాదీపంగా నిలుస్తోంది ఈ పుస్తక నిలయం.సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఈ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలోనే టాస్క్‌ కేంద్రాన్ని నెలకొప్పి, నైపుణ్యాలతోపాటు విజ్ఞానాన్ని పంచుతూ యుువతను విజయతీరాలకు చేర్చుతోంది సిరిసిల్ల సినారె సరస్వతి మందిరం. ఈ సినారె సరస్వతి మందిరం సిరిసిల్లకే సకొత్త కళను తెచ్చిపెట్టింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారికే కాకుండా…మరికొన్ని ఉపాధి అవకాశాలను అందుకునే నైపుణ్యాలను పెంపొందించుకోటానికి సినారె స్మారక మందిరం ఒక చక్కని ప్రదేశం.

    ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రంథాలయం
    కేంద్ర గ్రంధాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ పచ్చని చెట్లుతో నిత్యం విద్యార్థుల రాకపోకలతో కలకళలాడుతుంది. సి.నారాయణ రెడ్డి స్మారకంగా ఏర్పాటు చేయబడిన ఈ మందిరం ఇప్పుడు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్‌కు మార్గనిర్దేశంలా కనిపిస్తోంది.

    టాస్క్‌(TASK) సెంటర్‌ ఏర్పాటు..
    ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ చొరవతో సినారె మందిరంలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశారు. టాస్క్ ద్వారా యువతకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం శిక్షణ సైతం ఇస్తున్నారు. C, C++, JAVA, Phyton, Oracle ఇలా మరికొన్ని సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 25 కంప్యూటర్ లు 40 వేల పుస్తకాలను లైబ్రరీలో సమకూర్చారు.. పర్యవేక్షణకులను ఏర్పాటు చేయడం ద్వారా యువత ఉపాధి మార్గాల అవసరాలు తీరనున్నాయి.

    డిజిటల్ లైబ్రరీ..
    డిజిటల్ లైబ్రరీ కూడా కావడంలో స్థానికంగా వివిధ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి ఇక్కడ మంచి శిక్షణ అందుతుంది. రోజుకు నాలుగు వందలకు పైగా విద్యార్థులు సినారె మందిరానికి వస్తున్నారు. గ్రూప్స్‌, బ్యాంకు జాబ్స్, రైల్వే, ఇతర రంగాల జాబ్స్ కోసం చూసే వారికి నాలెడ్జ్ హబ్ గా కూడా జిల్లా గ్రంధాలయం నిలుస్తోంది..
    పోటీ పరీక్షలకు ప్రైవేట్‌గా శిక్షణ పొందాలంటే వేలల్లో ఖర్చు పెట్టాలి కానీ ఎటువంటి ఫీజు లేకుండా యువతకు శిక్షణ అందిస్తోంది సినారె మందిరం. TASK ద్వారా ఒక్కో బ్యాచ్ లో 40 నుండి 50 మంది విద్యార్థులతో ట్రైనింగ్ సాగుతోంది.

    టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటుపై విద్యార్థులు హర్షం
    టాస్క్ ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతుందని స్థానిక యువత తెలుపుతున్నారు. సినారె మందిరంగా జిల్లా కేంద్రంలో ఉన్న ఈ గ్రంధాలయం వలన స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో సైతం ఇలాంటి సెంట్రల్ లైబ్రరీ లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నైపుణ్యాలతో పాటు విజ్ఞానాన్ని సైతం పొందేలా యువతరానికి ఉపయోగపడుతుంది.

    గ్రంథాలయం తెరిచి ఉండే సమయం
    ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు సినారె స్మారక గ్రంథాలయం ఓపెన్ చేసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల యువత , నిరుద్యోగులు, నిరుపేద యువతీ యువకులు ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని గ్రంధాలయ చైర్మన్ అకునూరి శంకరయ్య కోరారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Library, Siricilla

    తదుపరి వార్తలు