హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: అధికారులను మెచ్చుకున్న కేటీఆర్.. కారణం ఇదే..

KTR: అధికారులను మెచ్చుకున్న కేటీఆర్.. కారణం ఇదే..

సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధకారులను అభినందచారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Haribabu, News18, Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధకారులను అభినందచారు. బోయినిపల్లి మండలంలోని కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రంలోని ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా బాగుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి మంత్రి కేటిఆర్ కితాబునిచ్చారు. మంగళవారం కొదురుపాక మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలో వివిధ ఆక్టివిటీస్ మెటీరియల్ ని, ప్లే స్కూల్ మెటీరియల్ ని మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ చాలా చక్కగా ఉంది. వెరీ గుడ్.. కీప్ ఇట్ అప్ అంటూ సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి, ప్లే స్కూల్, కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికిమంత్రి అభినందనలు తెలిపారు. కేంద్రం అవరణలోని కిచెన్ గార్డెన్ లో పండిస్తున్న క్యాబేజీ, టమాట, గోంగూర, వంకాయ, మొక్కజొన్న, ఆకుకూరలు, మిరప, గోరుచిక్కుడు లాంటి కూరగాయల మొక్కల్ని చూసి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో తన అమ్మమ్మ- తాతయ్య జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం రూ.2 కోట్ల రూపాయలతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం మోడల్ అంగన్వాడీ భవనానికి ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు.. ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ మాట్లాడుతూ.. కోదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తుంచుకుని ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి స్వయంగా ముందుకు రావడం మంత్రి కేటిఆర్ గొప్పతనానికి నిదర్శనం అని అన్నారు. ఐటికి కేటిఆర్ మారు పేరుగా నిలిచారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయ్యిందనీ పేర్కొన్నారు. మంత్రికే.తారక రామారావు మాట్లాడుతూ.. నేను కొదురుపాకకు మంత్రిగా రాలేదు.. మనుమడిగా వచ్చాను. హైదరాబాద్ , కరీంనగర్ లో విద్యాభ్యాసం చేసేటప్పుడు మా తాతయ్య కొదురుపాకకు తీసుకువచ్చేవాడు. మా తాతయ్య చివరి చూపుకు నోచుకోలేదనీ అన్నారు. అమ్మమ్మ- తాతయ్య జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం ఇప్పటికేకొదురుపాకలో రైతు వేదిక కట్టామని పేర్కొన్నారు.

ఇది చదవండి: భద్రాద్రిలో ముదురుతున్న లడ్డూ వివాదం.. అసలేం జరిగిందంటే..!

కొదురుపాక గ్రామంలో అమ్మమ్మ- తాతయ్య జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం రూ. 2 కోట్లతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం 9 నెలల్లో చేపడుతామని అన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ఎప్పటికీ ప్రజలు గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకోవడo ముఖ్యమని అన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయితీలలో 19 మనవే. దేశంలో అత్యుత్తమ మున్సిపాలిటీలు 26 మనవే. ఇది మనందరికీ గర్వకారణమని, స్వచ్ఛ సర్వెక్షన్ లో రాజన్న సిరిసిల్ల దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచింది. కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది.

సీఎం కేసిఆర్ నాయకత్వంలో సిరిసిల్ల సహా 33 జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లలకు వైద్య విద్య అభ్యసిoచే అవకాశం కలిగింది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు బాగున్నాయి. 700 పైగా గురుకులాలు పెట్టి ఒక్కొకరికి లక్షా 20 వేలు ఖర్చు చేసి5 లక్షల విద్యార్ధులకు విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. 18 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 8 ఎండ్లలో చెల్లించామని, మన ఊరు మనబడి కార్యక్రమం కింద 3 దశల్లో 7300 కోట్ల రూపాయలలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

ఇది చదవండి: మహిళలకు అండగా సఖీ సెంటర్లు..! కాల్ చేయాల్సిన నంబర్లివే..!

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ త్రాగునీటినీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇది వరకూ కరెంట్ ఉంటే వార్త...ఇప్పుడు లేకపోతే వార్త అని అన్నారు. జిల్లాలో 4 వేల కోట్లను ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామని, కేసిఆర్ కిట్ ద్వారా ఆడ పిల్ల పుడితే 13 వేలు, మగ బిడ్డ పుడితే 12 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేస్తున్నామని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా 63 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక అన్ని రంగాలలో మార్పు వచ్చింది. తెలంగాణ వచ్చే నాటికి సగటు తలసరి ఆదాయం లక్షా 24 వేలు ఉండగా సిఎం కేసిఆర్ దక్షతతో 2 లక్షల 70 వేలకు పెంచారు. అదే సమయంలో దేశ తలసరి సగటు లక్షా 49 వేలు మాత్రమే, సెస్ ఎన్నికలలో మంచి విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు మంత్రి అన్నారు.

First published:

Tags: KTR, Local News, Siricilla, Telangana

ఉత్తమ కథలు