Home /News /telangana /

RAJANNA SIRCILLA MINISTER KTR RELATIVE CHITI NARSINGARAO EXPECTING TICKET FROM SIRCILLA THIS YEAR ABH BRV RKH

Rajanna Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు అంతా తానైన నర్సింగరావుకు ఈసారి పదవి దక్కేనా?

సిరిసిల్లలో కీలక నేత అయిన పదవులు రావడం లేదు ఎందుకు!?

సిరిసిల్లలో కీలక నేత అయిన పదవులు రావడం లేదు ఎందుకు!?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ మేనల్లుడు, కేటీఆర్ మేనబావ తెరాస పార్టీ సీనియర్ నాయకుడిగా చీటీ నర్సింగరావు అందరికీ  తెలిసిన వ్యక్తే. సిరిసిల్ల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసి సంఘం అభివృద్ధికి తోడ్పడ్డాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ మేనల్లుడు, కేటీఆర్ మేనబావ తెరాస పార్టీ సీనియర్ నాయకుడిగా చీటీ నర్సింగరావు అందరికీతెలిసిన వ్యక్తే. సిరిసిల్ల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసి సంఘం అభివృద్ధికి తోడ్పడ్డాడు. అలాగే తెరాస పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన నేతగా చీటీ నర్సింగరావుకు మంచి పేరుంది. సిరిసిల్ల తెరాసలో కీలక నేతగా ఉన్న ఆయన..తెరవెనక మంత్రి కేటీఆర్ మంచి చెడులు, పార్టీ బాగోగులు చూస్తూ ఉంటారు. తెరవెనక పరోక్షంగా కేటీఆర్‌కు సిరిసిల్లలోఓ రక్షణకవచంగా పని చేస్తూ.. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.

    సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోనిఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన చీటీ నర్సింగరావు ప్రస్తుతం సిరిసిల్ల రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. సిరిసిల్లలో నర్సింగరావుకు పదవి లేకున్నా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు ఆయన వెన్నంటి ఉన్నారు. 13 సంవత్సరాలుగా టీఆర్ఎస్ రాజకీయంలో నర్సింగరావు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని వాదనా లేకపోలేదు.



    గత సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు నర్సింగరావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి జైలుకు కూడా వెళ్లాడు. చీటీ నర్సింగరావు.. మంత్రి కేటీఆర్ ఇలాకాలో టిఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లకుండా అనునిత్యం, అతి ముఖ్యమైన సమయాల్లో తెరవెనుక కీలకంగా వ్యవహరిస్తూ సిరిసిల్ల మున్సిపల్ రెబల్ కౌన్సిల్ అంతా టిఆర్ఎస్‌లో జాయిన్ అయ్యేలా స్థానిక సిరిసిల్ల ముఖ్య నేతలతో స్కెచ్ వేసి సఫలీకృతం అయ్యాడు. పట్టణ రాజకీయాల్లో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లింగం చక్రపాణి, మంచే శ్రీనివాస్, బోల్లి రామ్మోహన్‌లతో కలిసి నర్సింగరావు...అతి కష్ట సమయంలో పార్టీని నిలబెట్టారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు సొంత తెరాస పార్టీ నేతలే బురదజల్లేందుకు యత్నించినా వెనక్కి తగ్గలేదు నర్సింగరావు.

    సిరిసిల్ల రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా చెరగని ముద్ర వేసుకున్నారు చీటీ నర్సింగరావు. 13 సంవత్సరాలుగా సిరిసిల్ల తెరాసలో కీలకంగా ఉన్న నర్సింగరావుకు రాజకీయంగా పదవులు అంత కలిసి రాలేదని చెప్పాలి. ఆయన కంటే తదుపరి వచ్చిన నేతలకు ఉన్నత రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. స్వయానా సీఎం కేసీఆర్ బంధువు కావడం, కుటుంబ సభ్యునికి పదవి ఇస్తే విమర్శలు వస్తాయని కారణంతో మంత్రి కేటీఆర్ సైతం ఆయన్ని పదవులకు దూరంగా పెడుతూ వస్తున్నారని జిల్లా కేంద్రంలో చర్చ కొనసాగుతోంది. అయినా పార్టీకి కీలక నేతగా పనిచేసి పట్టణంలో పలు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి విజయఢంకా మోగించినా పదవి రావడం లేదంటూ నర్సింగరావు అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. పార్టీపరంగా కార్యక్రమంలో ప్రోటోకాల్ కూడా లేకపోవడంతో కక్క లేక మింగలేక తన బావమరిది, మంత్రి కేటీఆర్‌కి ఏ విషయం చెప్పుకోలేక కాలం వెళ్లదీస్తున్నాడు చీటీ నర్సింగరావు.

    Read This: Rajanna Sircilla: ఔరా అద్భుత కళ.. ప్రభుత్వ పథకాన్ని వివరిస్తూ చీర నేసిన చేనేత కార్మికుడు
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana, Telangana Politics

    తదుపరి వార్తలు