హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేటీఆర్ మెచ్చిన స్కూల్ ఇదే..! అంతలా ఏముంది అక్కడ..?

కేటీఆర్ మెచ్చిన స్కూల్ ఇదే..! అంతలా ఏముంది అక్కడ..?

వేములవాడ స్కూల్‌కి కేటీఆర్ కితాబు

వేములవాడ స్కూల్‌కి కేటీఆర్ కితాబు

మీ స్కూల్ చాలా బాగుందని మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ (KTR) ఇలా అన్నారు. మనఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

మీ స్కూల్ చాలా బాగుందని మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ (KTR) ఇలా అన్నారు. మనఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయి. మీ స్కూల్ చక్కగా ఉంది. సౌకర్యాలు బాగున్నాయి అంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కితాబు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కే.తారకరామారావు వేములవాడ మండలం అగ్రహారం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను పరిశీలించారు. జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్ పాఠశాలలలో చేపట్టిన పనులను మంత్రికి వివరించారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద రూ.40.91 లక్షలతో ZPHS లో రూ.27.27 లక్షలతో MPPS లో పనులు చేపట్టామని తెలిపారు. ఎలక్ట్రిసిటి, కిచెన్ షేడ్, ప్రవారీ, సంప్, ఫ్యాన్స్ పెయింటింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. MPPS లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని చెప్పారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనులను పరిశీలించిన మంత్రి పనులు బాగున్నాయని కితాబు నిచ్చారు.

ఇది చదవండి: ఈ స్కూల్‌కి మంత్రివర్గం.. పిల్లలే మంత్రులు..! ఎక్కడుందంటే..!

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి పథకాన్ని కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య , నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తుందన్నారు.

ఇది చదవండి: చరిత్ర కలిగిన శిల్పకళా సంపద.. అభివృద్ధికి నోచుకోని ఖిల్లా వరంగల్

జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద మొదటి విడత రూ. 20 కోట్ల 38 లక్షల రూపాయలతో 172 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి పనులకు పెద్ద పీట వేసిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సీఎం కేసీఆర్ అధినాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, టేస్కాబ్ చైర్మన్ కొండూరీ రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, రాజన్న సిరిసిల్లజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ లు బి.సత్య ప్రసాద్, ఆర్డీఓలు టి.శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: KTR, Local News, Telangana, Vemulawada

ఉత్తమ కథలు