Home /News /telangana /

RAJANNA SIRCILLA MIGRANT LABORERS FROM BIHAR AND UP STATES WORKING AS AGRI LABORERS IN TELANGANA BRV RKH ABH

Rajanna Sircilla: పనిమంతులంటే వీళ్లే.. మహా'నాటుగాళ్లు': వరినాట్లు వేసేందుకు వచ్చిన బీహార్ కూలీలు

వరి

వరి నాట్లు వేస్తున్న బీహార్, యూపీ కూలీలు

ఇన్నాళ్లు యూపీ, బీహార్, బెంగాల్ నుంచి ఉపాధి నిమిత్తం దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే వలస కార్మికులు కేవలం నిర్మాణ రంగం, ఇతర పరిశ్రమలో పనులు చేసేవారు. 'పైసలు సరైన టైంకు రావాలే గానీ ఏ పనైనా చేస్తాం' అన్నట్టుగా ఆ వలస కూలీలు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    K.Haribabu, News 18, Rajanna sircilla

    ఇన్నాళ్లు యూపీ, బీహార్(bihar), బెంగాల్(bengal) నుంచి ఉపాధి నిమిత్తం దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే వలస కార్మికులు, కేవలం నిర్మాణ రంగం, ఇతర పరిశ్రమలోనూ పనులు చేసేవారు. అయితే 'పైసలు సరైన టైంకు రావాలే గానీ ఏ పనైనా చేస్తాం' అన్నట్టుగా ఆ వలస కూలీలు వ్యవసాయ పనులు కూడా చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(vemulawada) రూరల్ మండలం లింగంపల్లి (lingampally) , హన్మాజీపేట, బొల్లారం గ్రామాల్లో ఇటీవల వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయి. ఈక్రమంలో యూపీ, బీహార్ స్టేట్లకు చెందిన 20 మంది వలస కార్మికులు...వరి నాట్లు వేసేందుకు వచ్చారు.

    ఉత్తరప్రదేశ్(uttar pradesh), బీహార్‌‌కు చెందిన ఈ వలస కార్మికులు రోజుకు 8 ఎకరాల వరకు వరి నాట్లు వేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఒక ఎకరానికి రూ. 4800-5000 వరకు కాంట్రాక్టు మాట్లాడుకుంటూ వారే పని మొత్తం చేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్నడంతో రైతులే ఈ కూలీలకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఉపాధి లేక తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చినట్లు వారు తెలిపారు.

    సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు:
    ఈసందర్భంగా లింగంపల్లి గ్రామ సర్పంచ్ తిరుపతిరెడ్డి న్యూస్ 18 ప్రతినిధితో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 మంది వలస కార్మికులు ప్రతి సంవత్సరం తమ గ్రామానికి వచ్చి వరి నాట్లు వేస్తున్నట్లు వెల్లడించారు. వలస కార్మికులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ వ్యవసాయ పనులు ప్రారంభం అయిన సమయాల్లో మహిళా కూలీల కొరత ఉండడం...దీనికి తోడు బీహార్, యూపీ వలస కార్మికులు వచ్చి వరినట్లు వేయడంతో ఈ వర్ష కాలంలో వరి నాట్లు జోరందుకున్నాయని రైతులు అంటున్నారు. వేసవికాలం కంటే వర్షాకాలంలో అధిక విస్తీర్ణంలో రైతులు వరి నాట్లు వేస్తున్న విషయం తెలిసిందే. కూలీల కొరత ఉండడంతో.. పని అధికంగా ఉంది. ఇక్కడి కూలీలకు నష్టం వాటిల్లకుండానే ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు చేయిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువగా పని చేస్తున్నారని రైతులు సైతం యూపీ, బీహార్ కూలీలను పనిలోకి తీసుకుంటున్నారు.

    Read this also; Mulugu: రామప్ప ఆలయాన్ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు! ఆగస్టు 15 స్పెషల్..



    రోజుకి 8-9 ఎకరాల్లో నాట్లు వేస్తున్న వలస కూలీలు:
    ఈ ఏడాది వర్షాలు ముందే కురవడంతో పొలం పనులు ప్రారంభించిన రైతులు... వ్యవసాయ కూలీలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేగంగా వేయడంతో సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అయినట్లు రైతులు తెలిపారు. రోజుకు 8-9 ఎకరాల వరి నాట్లు వేస్తున్నట్లు చెబుతున్న రైతులు కూలీల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వరి నాట్లు వెనుకబడుతున్నాయని ఆందోళన చెందుతున్న రైతులకు ఇతర రాష్ట్రాల కూలీలు అండగా నిలుస్తున్నారని చెప్పాలి. ఎవరికైనా వరి నాట్లు వేసేందుకు కూలీలు కావాలంటే వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీహార్ యూపీ రాష్ట్రాల వలస వ్యవసాయ కూలీలు బస చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ తిరుపతి రెడ్డి సైతం కూలీలకు సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారని రైతులు కూలీలు చెబుతున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Agriculture, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు