హోమ్ /వార్తలు /తెలంగాణ /

పనికి రాని ప్లాస్టిక్ బాటిల్స్ తో లాభాలు.. నలుగురు ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి

పనికి రాని ప్లాస్టిక్ బాటిల్స్ తో లాభాలు.. నలుగురు ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి

X
వేములవాడలో

వేములవాడలో ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యునిట్ తో లాభాలు

Vemulawada: మారుమూల ప్రాంతం వచ్చివ వ్యక్తి ఓ నలుగురికి సాయం చేద్దాం అనుకున్నాడు. అది కూడా పని సాయం కల్పిస్తూ.. అటు తనకు అటు వారికి లాభాసాటిగా ఉండేలని ఆలోచించాడు.. పలు చోట్ల తిరిగాడు. ఏ వ్యాపారము పెట్టలో తోచని పరిస్థితి... అయితే తనకు వచ్చిన ఆలోచన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

మారుమూల ప్రాంతం వచ్చివ వ్యక్తి ఓ నలుగురికి సాయం చేద్దాం అనుకున్నాడు. అది కూడా పని సాయం కల్పిస్తూ.. అటు తనకు అటు వారికి లాభాసాటిగా ఉండేలని ఆలోచించాడు.. పలు చోట్ల తిరిగాడు. ఏ వ్యాపారము పెట్టలో తోచని పరిస్థితి... అయితే తనకు వచ్చిన ఆలోచన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! అటుపకృతికి హని కలిగించే ప్లాస్టిక్ వస్తువులనురీసైక్లింగ్ చేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఆ వివరాలు.. ఓ సామన్యమైన వ్యక్తి ఓ శక్తిగా మారి పలువురికి ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నాడు.. ఆయనే జలగం హనుమంతరావు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తు పలువురికి ఉపాధిని కల్పిస్తున్న ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla DIstrict) వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించారు.

నిత్యం కొన్ని వేల మిలియన్ల ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతూ పడేస్తుంటారు. అలాంటి వాటిని చిత్తుకాగితాల వృత్తి వారు ఏరుకుని వేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ కి అంత డిమాండ్ ఉంది మరి. అందుకనే హనుమంతరావు వ్యాపారం ప్రారంభించారు.తన వద్ద వచ్చే రోజువారి కూలీలకు రూ.500 ఇస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ కిలోకు రూ. 27-29 వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు. తద్వారా వచ్చే ప్లాస్టిక్ మెుత్తాన్నిప్రెస్సింగ్ హైడ్రాలిక్ మిషన్ను సహయంతో ఓ పెద్ద బ్రిక్స్ లా తయారి చేసి హైదరాబాద్ (Hyderabad), గుజరాత్ (Gujarath) ప్రాంతాలను తరలిస్తారు.

ఇది చదవండి: ఇతను రంగంలోకి దిగితే పతకం గ్యారెంటీ..! పంచ్ పవర్ అలాంటిది మరి..!

ఈ మిషన్ ను హనుమంతరావు.. రూ.5లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మొట్ట మొదటి స్క్రాప్ ప్రెస్సింగ్ మిషన్ ఇదే అని చెప్పారు. 1997 నుంచి స్క్రాప్ బిజినెస్స్ చేసినట్లు చెబుతున్నారు తద్వారా బాటిల్స్ ను విడివిడిగా ఓ మూటలో కట్టి పంపుతుంటే రవాణా ఖర్చులు ఎక్కువ అయ్యేవని.. ప్రస్తుతం ఈ మిషన్​ ద్వారా బాటిల్స్ ను ఓ బ్రిక్స్ రూపంలో చేయటంతో రవాణా ఖర్చులు ఆదా చేస్తున్నామని తెలుపుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా చాలాసంతోషంగా ఉందని, దాని ద్వారా రోజుకు 5-11మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. నెలకు వారు రూ. 12 వేలనుంచి 14 వేల వరకు సంపాదిస్తున్నారు.

వర్కర్ పిట్టల లక్ష్మణ్.. మాట్లాడుతూ.. నేను గతంలో మాథ్స్ టీచర్ గా విద్యార్థులకు పాఠాలు బోధించానని, కరోనా విపత్తు సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు. దానికి తోడు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపాడు. హనుమంతరావు సారు తనకు ప్లాస్టిక్ రీసైకిల్ పరిశ్రమలో ఉపాధి కల్పించి అండగా నిలిచారని వివరించాడు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే వేములవాడ పట్టణ శివారులోని రెండో బైపాస్ ప్రాంతంలో గల ప్లాస్టిక్ రీసైకిల్ పరిశ్రమను సంప్రదించాలని కోరారు. నేరుగా ప్లాస్టిక్ను అందజేస్తే అదనంగా రెండు రూపాయలను అదనంగా ఇస్తామని ప్లాస్టిక్ సేకరించే వారికి సూచించారు.

First published:

Tags: Local News, Telangana, Vemulawada