Home /News /telangana /

RAJANNA SIRCILLA MAN COMMITTED SUICIDE AFTER DEVEATIONS FROM WIFE IN RAJANNA SIRCILLA ABH BRV RKH

Rajanna Sircilla: మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య.. అసలు విషయం ఏంటి?

ఆత్మ హత్య చేసుకున్న అనిల్ కుమార్ దృశ్యం

ఆత్మ హత్య చేసుకున్న అనిల్ కుమార్ దృశ్యం

సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన మిట్టపల్లి అనిల్ కుమార్ (32)కు మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. వివాహమైన కొన్ని మాసాల్లోనే భార్యతో విభేదాలు వచ్చాయి.. దీంతో ఆమె పుట్టింటికి పోయింది. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో అనేకమార్లు పంచాయతీలు జరిగాయి

ఇంకా చదవండి ...
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన మిట్టపల్లి అనిల్ కుమార్ (32)కు మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. వివాహమైన కొన్ని మాసాల్లోనే భార్యతో విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె పుట్టింటికి పోయింది. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో అనేకమార్లు పంచాయతీలు జరిగాయి. అనిల్ బాధితురాలికి డబ్బు చెల్లించాలని నిర్ణయించారు. ఒప్పుకున్న ప్రకారం చెల్లించే తేదీ రావడం... అప్పటికి అనిల్ చేతిలో డబ్బు లేకపోవడం, భార్య పూర్తిగా దూరమవుతుందని మనస్థాపానికి గురై కుమిలిపోయాడు. డబ్బులు ఏర్పాటు చేస్తానని ఆదివారం ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అనిల్, తిరిగి ఇంటికి వెళ్ళలేదు. సోమవారం సాయంత్రం కొత్తచెరువు సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అనిల్ మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

    మాజీ జడ్పీటీసీ మృతి:

    రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం చెందిన మాజీ జెడ్పిటిసి (దోమకొండ) మన్నే నరసింహులు (53) చికిత్స పొందుతూ మృతి చెందాడు. నరసింహులు వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కొత్త పెళ్లికి చెందిన వంగ శ్రీనివాస్ రెడ్డి వద్దకు వచ్చి ఏడాదిగా వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం నరసింహులు మరికొంతమంది కలిసి కారులో కొత్తపల్లిలోని శ్రీనివాస్ రెడ్డికి చెందిన మామిడి తోటలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మా ఏరియాలోకి వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తూ మీరు బాగుపడుతున్నారు..మా నాన్న ఏ పని లేకుండా తిరుగుతున్నాడని సందీప్ రెడ్డి(శ్రీనివాస్ రెడ్డి కుమారుడు).. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే గొడ్డలి తీసుకొని విచక్షణా రహితంగా దాడి చేశాడు. రక్తస్రావమైన బాధితులని ముస్తాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఈక్రమంలో నరసింహులు మృతి చెందాడు. కాగా సందీప్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోమవారం అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..తంగళ్ళపల్లి గ్రామపంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్న కొండ ఆంజనేయులుకు కొండ జ్యోతితో 23 ఏళ్ల క్రితం పెళ్లయింది. వారికి కొడుకు ప్రవీణ్ కూతురు పవిత్ర ఉన్నారు. గత కొంతకాలంగా జ్యోతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మృతురాలి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చూపించినా నయం కాలేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆంజనేయులు అంబులెన్స్ ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి జ్యోతిని పరిశీలించి.. ఆమె అప్పటికే మృతి చెందిందని చెప్పారు. మెట్ల పైనుంచి పడి తన భార్య మరణించినట్లు ఆంజనేయులు తెలిపాడు. పోలీసులు ముసదేహాన్ని పరిశీలించి మెడపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    తదుపరి వార్తలు