(Syed.Rafi,News18,Mahabubnagar)
కూతురు వయసు కంటే చిన్నది. మనవరాలి వయసున్న చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడో కామాంధుడు. నమ్మకద్రోహి మాత్రమే కాదు నరరూపరాక్షసుడని నిరూపించుకున్నాడు. అభం, శుభం తెలియని 8సంవత్సరాల చిన్నారిని బిడ్డలా చూసుకుంటాడని బాలిక తల్లిదండ్రులు నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ముచేసి జైలుపాలయ్యాడు. 8సంవత్సరాల చిన్నారిపై 50సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వనపర్తి (Vanaparthi)జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన షేక్ ముచాన్ (Sheikh Muchan). 50 సంవత్సరాలు(50Years old man) కలిగిన నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి పనుల కోసం వనపర్తి జిల్లాకు వలస వచ్చాడు. అత్యాచారనికి గురైన 8 సంవత్సరాల చిన్నారి(8Year old girl) తల్లిదండ్రులది చత్తీస్గడ్Chhattisgarh. వాళ్లు కూడా పిల్లలు, పెద్దల్ని తీసుకొని బతుకుదెరువు కోసం వలస వచ్చారు. అంతా మధనాపురం సమీపంలోని ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకుని అక్కడే నివాసముంటున్నారు. రామన్‌పాడు డ్యామ్ పరిధిలోని రైల్వే ట్రాక్ విద్యుత్ స్తంభాల (Railway track power pole) పనులు చేస్తున్నారు. వారికి వంట చేయడం, పగలు పనికి వెళ్లిన సమయంలో పిల్లల్ని కాపలా చూసుకునే బాధ్యతను షేక్ ముచాన్ చూస్తున్నాడు.
వాడో మానవమృగం..
పెద్దవాళ్లందరూ పనులకు వెళ్లిన సమయంలో మచ్చన్ వారి పిల్లలకు గార్డియన్‌గా ఇంటి దగ్గరే ఉండేవాడు. ఈక్రమంలోనే బుధవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంటి దగ్గరున్న చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు కామాంధుడు. మానవమృగం చేసిన గాయానికి చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. భయపడిపోయిన నిందితుడు వెంటనే చిన్నారిని మదనపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. డాక్టర్లు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పి మెరుగైన చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకొని వెళ్లాలని సూచించారు. అలాగే ఎవరు చేశారు ? ఎలా జరిగిందని ఆరా తీయడంతో నిందితుడు భయపడిపోయాడు. మచ్చన్పై అనుమానంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
ముక్కుపచ్చలారని పిల్లపై..
8ఏళ్ల బాలికను కామాంధుడు కాటేసిన వార్త వనపర్తి జిల్లా మధనాపురం మండలంలో కలకలం రేపింది. బాధితురాలి తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు, ఆధారల ప్రకారం నిందితుడు మచ్చన్పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం గాలించి రామన్‌పాడు గ్రామంలో మాటువేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిని విచారణ జరిపిస్తున్నట్లుగా ఎస్ఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Child rape, Mahabubnagar