రిపోర్టర్ : హరి
లొకేషన్ : సిరిసిల్ల
అతను ప్రకృతి ప్రేమికుడు.. ప్రతిక్షణం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తపన పడుతుంటాడు. ఈ క్రమంలోనే ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ కూతురిపై, పర్యావరణంపై ఉన్న ప్రేమతో పెళ్లి కార్డును 25 వీఎండి 51 కార్డును తయారు చేయించాడు. ఈ కార్డును పెళ్లి తంతు ముగిశాక.. మట్టిలో పెడితే తులసి మొక్క బయటకు వచ్చేలా తయారు చేయించాడు.
సాధారణంగా ఎవరైనా (marriage invitation) పెళ్లికార్డును వివాహం కాగానే బయట పడేస్తాం. లేదంటే దానిని ఎక్కడో మూలకు ఉంచుతాం. పెళ్లైన తర్వాత దాంతో ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాకాకుండా పెళ్లికి ముందు, పెళ్లైన తర్వాత కూడా ప్రయోజనాన్ని అందించడమే కాకుండా, ఆ కార్డు మట్టిలో కలిసిపోయి తులసి మొక్కకి ప్రాణం పోయడం అంటే ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి.
వివరాల్లోకెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ తన తండ్రి శంకరయ్య పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా, హైద్రాబాద్ ప్రాంతాల్లో ఉచిత స్వర్గయాత్ర వాహనాలను, బాడీ ఫ్రీజర్లను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాడు జ్ఞానేందర్. కాగా ఫిభ్రవరి 24న జరిగే తన కూతురు శరణ్య వివాహానికి వినూత్న రీతిలో ఆహ్వానపత్రికలు తయారు చేయించాడు. వివాహం జరిగిన తర్వాత కార్డును మట్టితో కూడిన పాత్రలో పెడితే 2 రోజుల తర్వాత అందులోంచి తులసిమొక్క ఉద్భవించడం ఈ కార్డు యొక్క ప్రత్యేకత అని న్యూస్18తో జ్ఞానేశ్వర్ తెలిపాడు.
పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేయడానికే ఖర్చు ఎక్కువైనా ఈకార్డును తయారు చేయించామని జ్ఞానేందర్-శ్రీలక్ష్మి దంపతులు పేర్కొన్నారు. జ్ఞానేశ్వర్ తన తండ్రి శంకరయ్య పేరిట చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఏదేమైనాప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం జ్ఞానేశ్వర్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రత్యేక మనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లి పత్రిక నుంచి తులసి మొక్క రావడం అంటే ఇంటికి లక్ష్మీదేవి రావడమే అని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవిగా చూస్తాం మనమందరం. ప్రతిరోజు మహిళలు ఆడపడుచులు తమ ఇంటి ముందు ఉన్న తులసి మొక్కకు పూజలు నిర్వహించడం ప్రతిరోజు మనం చూస్తుంటాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Telangana