Home /News /telangana /

RAJANNA SIRCILLA LOCALS PROTESTED AGAINST FOREST OFFICIALS WHO PLANTED GREEN SAPLINGS IN WASTE LANDS IN MARIMADLA ABH BRV RKH

Rajanna Sircilla: అయ్యా కేసీఆర్​ సారూ.. ఈ ఊళ్లోనే తిరిగితివి కదయ్యా.. మా గోడు పట్టదా?

పోడు

పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటవద్దని దళిత గిరిజన రైతుల ఆందోళన

తాము 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటవద్దని అక్కడి మహిళలు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటారు. దీంతో అధికారులకు, గిరిజన మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది

ఇంకా చదవండి ...
  (K.Haribabu, News 18, Rajanna Sircilla)

  రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో పొడు భూముల వ్యవహారం మరోసారి ఉద్రిక్తంగా మారింది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు హరితహరం మొక్కలు నాటవద్దని.. దళిత, గిరిజన మహిళా రైతులు ఆందోళన చేపట్టారు. హరితహారంలో భాగంగా మంగళవారం ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను గిరిజన మహిళలు తొలగించగా.. అటవీశాఖ సిబ్బంది అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా సిరిసిల్ల పరిధిలో పోడు భూముల వ్యవహారం అటు అటవీశాఖకు ఇటు గిరిజనులకు మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈక్రమంలో అటవీ భూముల ఆక్రమణలపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోడు భూముల పేరుతో అటవీ ప్రాంతం అన్యాక్రాంతం అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తునాన్రు.

  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం పరిధిలోని అటవీ భూములలో హారితహరం కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. అయితే తాము 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటవద్దని అక్కడి మహిళలు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటారు. దీంతో అధికారులకు, గిరిజన మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎమ్మార్వో నరేందర్.. ఘటనా స్థలానికి చేరుకొని మహిళలకు సర్ది చెప్పారు. పోడు భూములకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.

  మరిమడ్ల గ్రామంలో భూమిలేని నిరుపేద దళిత, గిరిజన కుటుంబాలు 30 ఏళ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు తమ భూమిలో మొక్కలు నాటుతున్నరని బాధితులు తెలిపారు. భూమిని వదిలి వెళ్లిపోవాలని లేదంటే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారని స్థానికులు మీడియా ముందు వాపోయారు. భూముల విషయమై వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుకు ఇతర ఉన్నతాధికారులకు అనేకసార్లు విన్నవించినప్పటికీ వారు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. గ్రామానికి పక్కనే ఉన్న కేటీఆర్ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామలలో సేద్యం చేసుకుంటున్న వందల ఎకరాల పోడు భూములపై చర్యలు తీసుకోని ఫారెస్ట్ అధికారులు, మరిమడ్ల గ్రామంలో చెట్లను నాటేందుకు అత్యుత్సాహం కనబరుస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడెకరాల భూమి వద్దని, తాము ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి తమకు ఇప్పించాలని బాధితులు అంటున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Sircilla, Telangana

  తదుపరి వార్తలు