హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: న్యూస్18 కథనాలకు స్పందన.. చెరువులకు గోదావరి జలాలు

Telangana: న్యూస్18 కథనాలకు స్పందన.. చెరువులకు గోదావరి జలాలు

X
వేములవాడకు

వేములవాడకు గోదావరి జలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఫాజుల్ గ్రామంలోని చెరువులోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ రైతులు, టిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R, India

Haribabu, News18, Rajanna Sircilla

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఫాజుల్ గ్రామంలోని చెరువులోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ రైతులు, టిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటిని విడుదల చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 'నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలు' 'ఎండుతున్న పంట' కథనాన్ని న్యూస్ 18 ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనాలపై స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు, అధికారులు స్పందించి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో వేములవాడ నియోజకవర్గానికి గోదావరి జరాలు వచ్చాయని వేములవాడ రూరల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మండ్లు పేర్కొన్నారు.

వేములవాడ గ్రామీణ మండలం ఫాజుల్ నగర్ చెరువులోకి వచ్చిన గోదావరి జలాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేన్నమనేని రమేష్ బాబు కృషితో వేములవాడ నియోజకవర్గానికి గోదావరి జలాలు రావడం జరిగిందని, యాసంగి పంటకు సాగునీరు రావాలని ఎమ్మెల్యే ప్రత్యేక కృషి చేయడంతో ఈరోజు సాకారం అయిందన్నారు. దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు రావడం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అన్నారు.

ఇది చదవండి: పేదలకు ఇళ్ల స్థలాలు.. ప్రభుత్వ భూముల కోసం అధికారుల వేట

సీఎం కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని, రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం రైతుబంధు, రైతు బీమా, రైతులకు రుణమాఫీ, సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే రమేష్ బాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల అభ్యున్నతి కోసం గోదావరి జలాలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని పనులు చేసినా ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేసే పనే పెట్టుకున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో సైతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ టిఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రైతులు సైతం మాట్లాడుతూ..!

ఎండుతున్న వరి పంట పొలాలకు గోదావరి జలాల ద్వారా చెరువును నింపినందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల వానతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులను, ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారని.. ఇప్పటికే జిల్లా ఉన్నత అధికారులకు మంత్రి కేటీఆర్ పంట పొలాలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం వివరాలను నమోదు చేయాలని ఆదేశించారని.. అది క్షేత్ర స్థాయిలో అమలైతే మేలు జరుగుతుందని కోరారు.

First published:

Tags: Local News, Siricilla, Telangana, Vemulawada

ఉత్తమ కథలు