రిపోర్టర్ : హరి
లొకేషన్ : సిరిసిల్ల
మన మందరం ఒక జట్టుగా పనిచేసి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చక్కని ఫలితాలను అందిద్దామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (Rajanna Siricilla SP Akhil Mahajan) అధికారులకు, సిబ్బందికి సూచించారు. జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహించే వివిధ పోలీస్ విభాగాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఇందులో భాగంగా జిల్లా కార్యాలయములోని ఆర్మూడ్ రిజర్వ్ విభాగంతో పాటు హోంగార్డ్స్, కమాండ్ కంట్రోల్, బాంబ్ డిస్పోజల్ విభాగం, ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్, కంట్రోల్ రూం, డాగ్ స్కాడ్, ఆర్ఐ, కన్స్యూమర్ స్టోర్స్, అదనపు డిసిపిలు, ఇతర పోలీస్ అధికారుల కార్యాలయాలనుఅధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, వారు నిర్వర్తిస్తున్న విధులను జిల్లా ఎస్పీ (SP Akhil Mahajan) సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు.
అనంతరం ఆర్మూడ్ రిజర్వ్ విభాగం సిబ్బందితో ఎస్పీ ముచ్చటిస్తూ.. సిబ్బందికి ఏదైనా సమస్యతో వుంటే ఎప్పుడైనా తనను కలుసుకోవచ్చని, సంక్షిప్త మేసేజ్ ద్వారా కూడా తమ సమస్యను తెలియజేసుకోవచ్చని.. ముఖ్యంగా సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, అదే విధంగా సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాని, ముఖ్యంగా సిబ్బందికి విశ్రాంతి కల్పించడంతో పాటు వారు తెలియజేసే సమస్యలపై స్పందిస్తానని, రానున్న రోజుల్లో మీరందరిని కలసి ప్రత్యేకంగా సమావేశమవుతామని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్(IPS) ప్రస్తుత ఎస్పీ రాహుల్ హెగ్డే (IPS)నుండిబాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రాహుల్ హెగ్డే హైదరాబాద్ ట్రాఫిక్-1డిసిపిగా బదిలీ కాగా ఆయన స్థానంలో 2017 బ్యాచ్ కు చెందిన అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్లను నూతన ఎస్పి అఖిల్ మహాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎస్పీకి ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థప్రసాలను ఎస్పీకి అందజేశారు.. వారి వెంట వేములవాడ పోలీసులు, ఆలయ అధికారులు, అర్చకులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna, Telangana