హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: గ్రామ శివారులో చిరుత పులి సంచారం: బిక్కుబిక్కుమంటున్న ఊరి జనం

Rajanna Siricilla: గ్రామ శివారులో చిరుత పులి సంచారం: బిక్కుబిక్కుమంటున్న ఊరి జనం

గ్రామ శివారులో చిరుత

గ్రామ శివారులో చిరుత

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల శివారులో చిరుతపులి సంచారం స్థానిక రైతులకు, పశువుల కాపరులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరుస సంఘటనలతో వారు భయాందోళనకు గురవుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (K. Haribabu, News18, Rajanna siricilla)

  రాజన్న సిరిసిల్ల (Rajjanna Sircilla) జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల శివారులో చిరుతపులి (Leopard) సంచారం స్థానిక రైతులకు, పశువుల కాపరులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరుస సంఘటనలతో వారు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించడమే కాకుండా, మూగజీవాలపై చిరుత దాడి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం ముచ్చర్ల గ్రామానికి చెందిన అల్వాల రాజయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపింది. పులి ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. గత నెల రోజుల్లో సూర్యనాయక్, బుడిగెల కనకయ్యలకు చెందిన దూడలపై చిరుత దాడి చేసిందని గ్రామస్థులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత జాడ కనిపెట్టాలను గ్రామస్థులు వేడుకుంటున్నారు.

  తొమ్మిది మందిపై కేసు: అనుమతులు లేకుండా అటవీ భూమిని చదును చేయడమే కాకుండా అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్సై రాజిరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన గుర్రపు నరేశ్ , గుర్రపు ముత్తవ్వ , గుర్రపు స్వరూప , తనుగుల సంధ్య , నల్లూరి పుష్పలత,తనుగుల రాజవ్వ నల్లూరి వినోద, గుర్రపు శంకర్ , నల్లూరి కిరణ్ గ్రామ శివారులోని అటవీ భూములను చదును చేసుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు.

  అనుమతులు లేకుండా ఎందుకు భూములు సాగు (Land Cultivation) చేస్తున్నారని అక్కడికెళ్లిన అడవిపదిర అటవీశాఖ బీట్ అధికారి సతీశ్ ప్రశ్నించారు. అయితే సతీష్ మరియు రైతుల మధ్య గత 15 రోజుల క్రితమే వాగ్వాదం జరిగింది. అధికారులు ప్లాంటేషన్ పనులకు వెళ్లగా గురువారం మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో సతీశ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై తెలిపాడు.

  Business Plan: రూ. 20 వేలు పెట్టుబడితో 3 లక్షల ఆదాయం.. బెండకాయ సాగుతో లాభాలు ఆర్జిస్తున్న యువరైతు

  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంభీరావుపేట మండలం రాజేశ్వర్రావునగ ర్, గంగవరం గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా భావించి గురువారం బైండోవర్ చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ఎదుట బైండో వర్ చేసి ఒక్కొక్కరికీ రూ.లక్ష పూచీకత్తుతో మరోసారి ఎక్సైజ్ నేరానికి పాల్పడబోమని హామీపత్రం తీసుకున్నట్లు తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Karimnagar, Local News, Sircilla