Home /News /telangana /

RAJANNA SIRCILLA LACK OF BASIC FACILITIES IN RECENTLY OPENED KASTHURBHA GANDHI GIRLS SCHOOL RKH BRV ABH

Rajannasircilla: హంగు ఆర్భాటాలతో తెరిచిన పాఠశాలలో భద్రత ఏది?: కస్తూర్బా పాఠశాల పరిస్థితి

the problems facing by the school childrens of kasturiba vidyalaya

the problems facing by the school childrens of kasturiba vidyalaya

రూరల్ ప్రాంతాలలో వెనుకబడిన, పేద, మధ్య తరగతి ఆడ పిల్లలకు ప్రాథమిక, ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా, పాఠశాలలో నిర్వహణ తీరు అగమ్యగోచరంగా మారింది

ఇంకా చదవండి ...
    (K.HariBabu, News 18, Rajannasircilla)

    రూరల్ ప్రాంతాలలో వెనుకబడిన, పేద, మధ్య తరగతి ఆడ పిల్లలకు ప్రాథమిక, ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా, ఆయా పాఠశాలలో నిర్వహణ తీరు అగమ్యగోచరంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నాలుగో వార్డ్ పరిధిలో ఇటీవల ప్రారంభించిన కస్తూర్బా బాలికల పాఠశాలలో అరకొర సౌకర్యాలు ఉన్నాయి. రూ. 3 కోట్ల 35 లక్షలతో ఎంతో హంగూ ఆర్భాటాలతో నిర్మించిన ఈ కస్తూర్బా బాలికల పాఠశాల భవనాన్ని జూన్ 10న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక శాసన సభ్యులు రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. పాఠశాల ప్రారంభించిన మూడు రోజుల్లోనే 2022-23 విద్యా సంవత్సరానికి తరగతులు కూడా ప్రారంభమైయ్యాయి. కస్తూర్బా బాలికల పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థినిలు చదువుతున్నారు. 9 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

    అరకొరగా సౌకర్యాలు, అసంపూర్తి పనులు:
    ఎంతో హడావిడిగా పాఠశాల ప్రారంభం అయింది. అయితే పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రధానంగా పాఠశాల భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించకపోవడంతో రాత్రి సమయాల్లో పాములు, తేళ్లు, ఇతర జంతువులు పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. బాలికలు ఇక్కడే ఉండే చదువుకునే ఈ పాఠశాలలో భద్రత చర్యలు లోపిస్తున్నాయి. భవనంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం విద్యార్థినుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థుల డైనింగ్ హాల్, కుర్చీలు, టేబుల్స్ లేవు. హాస్టల్ నిర్మించినా పడుకోవడానికి బెడ్స్ లేకపోవడంతో బాలికలు నేలపైనే నిద్రిస్తూ అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో కనీసం తాగేందుకు మంచి నీటి సదుపాయం కూడా లేకపోవడంతో ఉపాధ్యాయులే తమ సొంత ఖర్చులతో మినరల్ వాటర్ కొంటున్నారు. వేములవాడ మొదటి బైపాస్, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈపాఠశాలకు చెరువుకోవాలంటే సరైన రోడ్డు కూడా లేదు. ఉన్న మట్టి రోడ్డు కూడా ఇటీవల వర్షాలకు గతుకుల మయంగా మారడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది. రహదారి గుండా వీధి దీపాలు లేకపోవడంతో చీకటి మయంగా మారుతుంది. ఏదైనా అత్యవసర సమయంలో బాలికలను ఆసుపత్రికి తరలించాలన్నా ఇటుగా వాహనాలు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. రాత్రి సమయాల్లో పాఠశాల ప్రాంతాలపై స్థానిక పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి పాట్రోలింగ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.



    వేములవాడ పట్టణ శివారులో ఉన్న కస్తూర్బా పాఠశాల, పచ్చటి పంట పొలాలకు సమీపంలో, ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో నూతనంగా నిర్మించారు. పరిసర ప్రాంతాలు బాగానే ఉన్న, పాఠశాలలో కనీస సౌకర్యాలు లోపించడం విద్యార్థినిలను, తల్లిదండ్రులను కొంత అసహనానికి గురిచేస్తుంది. భవనానికి ప్రహరీ గోడ, సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యం, డైనింగ్ హాల్, బెడ్స్, లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

    పాఠశాల అడ్రెస్స్: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం
    మర్రిపల్లి, వేములవాడ అర్బన్, రాజన్న సిరిసిల్ల జిల్లా,                                               Contact number of DEO : 79958087618, School principal: 99897 75773
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: EDUCATION, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు