హోమ్ /వార్తలు /తెలంగాణ /

Women Protest: రోడ్డెక్కిన మహిళలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా.. ఎందుకంటే?

Women Protest: రోడ్డెక్కిన మహిళలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా.. ఎందుకంటే?

సిరిసిల్ల

సిరిసిల్ల

వర్షాలు కురిసినప్పుడల్లా అక్కడి గ్రామాల ప్రజలకు దినదిన గండమే. పని మీద నిత్యం మండల కేంద్రానికి వచ్చే గ్రామస్థులు ఇక్కడి వాగు ధాటి ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. వాగుపై వంతెన నిర్మించాలంటూ ఎన్నో రోజులుగా గ్రామస్థులు డిమాండ్

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  (K. Haribabu, News18, Rajanna siricilla)

  వర్షాలు (Rains)  కురిసినప్పుడల్లా అక్కడి గ్రామాల ప్రజలకు దినదిన గండమే. పని మీద నిత్యం మండల కేంద్రానికి వచ్చే గ్రామస్థులు ఇక్కడి వాగు ధాటి ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. వాగుపై వంతెన నిర్మించాలంటూ ఎన్నో రోజులుగా గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నా అదిగోఇదిగో అంటూ అధికారులు కాలక్షేపం చేస్తున్నారే తప్ప పనులు ప్రారంభించడం లేదు. రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా వేములవాడ (Vemula Wada)నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండల కేంద్రం నుండి కొత్తపేట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఒర్రె (వరద కాలువ) వర్షం పడినప్పుడల్లా కోతకు గురవుతుంది. దీంతో వర్షాకాలంలో ఇక్కడి గ్రామ ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవడం నిత్య కృత్యంగా మారింది.ఈ సీజన్లో కురిసిన వర్షాలకు వాగు పొంగిన సమయంలో ఇక్కడ వంతెన ప్రముఖ్యతను వివరిస్తూ న్యూస్ 18 ఒక కథనాన్ని ప్రచురించింది.

  విద్యార్థులు స్కూల్ మానేశారని..

  వాగుపై వంతెన (Bridge) నిర్మించాలని ఎన్నో రోజులుగా గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో మంగళవారం ఊరు మొత్తం కదిలి వచ్చి కోరుట్ల - వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో (Protest) నిర్వహించారు. ఒర్రె కోతకు గురై ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, రైతులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒర్రె కోతకు గురికావడంతో విద్యార్థులు స్కూల్ మానేశారని, ఉపాధ్యాయులు సైతం పాఠశాలకు రావడం లేదంటూ గ్రామ ప్రజలు వాపోతున్నారు.

  రైతులు పొలం పనులకు వెళ్లేందుకు నానాతంటాలు పడుతున్నారని, ఆడ పిల్లలు, మహిళలు అత్యవసర సమయంలో ఒర్రె దాటలేక ఇబ్బంది పడుతున్నారని, గర్భిణీ స్త్రీలు ఉంటే ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  వంతెన లేక కొత్తపేట గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నా నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబుకు కనిపించడం లేదా అని స్థానికులు మండిపడ్డారు. అసలు తమ గ్రామాభివృద్ధికి నిధులు ఉన్నాయా లేవా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండల అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలకు సర్ది చెప్పి తాత్కాలిక బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. వంతెన నిర్మాణంపై ఎమ్మెల్యే రమేష్ బాబు (MLA Ramesh babu), ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) వెంటనే స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

  వంతెన నిర్మాణానికి గతంలోనే అధికారులు హామీ ఇచ్చారని కానీ అవి కార్యరూపం దాల్చలేదని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో వరద కాలువను పరిశీలించి శాశ్వత పరిష్కారంగా వంతెన నిర్మించాలని కొత్తపేట గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Heavy Rains, Local News, Sircilla, Vemulawada

  ఉత్తమ కథలు