హోమ్ /వార్తలు /తెలంగాణ /

బాలీవుడ్ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన కరీంనగర్ కుర్రాడు..!

బాలీవుడ్ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన కరీంనగర్ కుర్రాడు..!

బాలీవుడ్ మూవీలో ప్రజ్ఞాన్

బాలీవుడ్ మూవీలో ప్రజ్ఞాన్

బాలీవుడ్ సినిమాలో కరీంనగర్ కుర్రాడు మెరిశాడు. . చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఆయన నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఈ చిత్ర పోస్టర్‌, ట్రైలర్‌ లాంచ్‌ ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బాలీవుడ్ సినిమాల్లో నటించాలన్నది చాలామంది ఆర్టిస్టుల కల, కొందరు ఎంత ప్రయత్నించినా  అక్కడ ఒక్క అవకాశం కూడా దక్కదు. కొందరికీ మాత్రి అనుకోకుండా ఆఫర్లు వస్తుంటాయి. తాజాగా తెలంగాణకు చెందిన కుర్రాడు ఇలాంటి బంపర్ ఆఫర్ కొట్టేశాడు. పూణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన కొంతమంది విద్యార్థులు కలిసి ఫ్రెండ్స్‌ అండ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై హిందీ, తెలుగులో 'కాలా బార్‌ బేరియన్‌ చాప్టర్‌ 1' అనే చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో విలన్‌గా నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రలో కరీంనగర్‌కు చెందిన ప్రజ్ఞన్‌ నటించారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఆయన నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఈ చిత్ర పోస్టర్‌, ట్రైలర్‌ లాంచ్‌ ఇటీవల ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగింది. దర్శకుడు ఎన్‌.శంకర్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీ శంకర్‌, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్‌ సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రజ్ఞన్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో నేను ఒక సైకో, మల్టీ పర్సనాలిటీ, నెక్రోఫిలియక్‌ ఇలా చాలా వేరియషన్స్‌ ఉన్న పాత్రల్లో నటించి చిత్ర యూనిట్‌ను మెప్పించాను. దర్శకుడు జింటో చాకో శామ్యూల్‌ సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో కూడా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.ఆర్‌ ప్రొడక్షన్స్‌ అధినేత పరుపాటి శ్రీనివాస రెడ్డి తెలుగులో విడుదల చేయనున్నారు' అని అన్నారు.

First published:

Tags: Karimnagar, Local News, Telangana News

ఉత్తమ కథలు