హోమ్ /వార్తలు /తెలంగాణ /

సైలెన్సర్లు బుల్డోజర్లతో తొక్కించిన..సీపీ .. వీడియో వైరల్..!

సైలెన్సర్లు బుల్డోజర్లతో తొక్కించిన..సీపీ .. వీడియో వైరల్..!

buldozers

buldozers

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వాహనాలకు అదనపు సైలెన్సర్లు బిగించడం ద్వారా ఏర్పడుతున్న శబ్దకాలుష్య ప్రభావంతో అనేకమంది అనారోగ్యాలపాలు కావడంతోపాటు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడుతున్నదన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

వాహనాలకు అదనపు సైలెన్సర్లు బిగించి శబ్దకాలుష్యానికి కారణం అవుతున్న వాహనదారులతో పాటు వాహనాలకు సైలెన్సర్లను బిగించే మెకానిక్ లు, విక్రయాలు జరిపే ఆటోమొబైల్ దుకాణాదారులపై కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఏలాంటి వాహనాల రూపులేకలు మార్చేందుకు అనుమతి లేదని చెప్పారు..

సోమవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో మెకానిక్ లు, ఆటోమొబైల్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వాహనాలకు అదనపు సైలెన్సర్లు బిగించడం ద్వారా ఏర్పడుతున్న శబ్దకాలుష్య ప్రభావంతో అనేకమంది అనారోగ్యాలపాలు కావడంతోపాటు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడుతున్నదన్నారు. శబ్దకాలుష్యానికి కారణం అవుతున్న సైలెన్సర్ల వాహనాలు పట్టుబడిన సందర్భాల్లో మెకానిక్ లు, విక్రయాలు జరిపిన ఆటోమొబైల్ దుకాణాల వివరాలు రాబట్టడం జరుగుతుందని అదీగాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇకపై మెకానిక్ లు శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను వాహనాలకు బిగించకూడదని, దుకాణాదారులు విక్రయకూడదని హెచ్చరించారు. శబ్దకాలుష్యానికి కారణం అవుతున్న సైలెన్సర్లను బిగించాలని వచ్చే వాహనదారుల సమాచారం పోలీసులకు అందించాలని చెప్పారు. శబ్దకాలుష్యానికి కారణమవుతున్న వాహనాల ప్రభావంతో వృద్ధులతోపాటు సాధారణ పౌరుల సైతం ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాహనాల విడిభాగాలు విక్రయించిన సందర్భాల్లో దుకాణాదారులు తేదీని పేర్కొంటూ బిల్లు రశీదులను అందజేయాలని ఆదేశించారు. పోలీసు, రవాణాశాఖ అధికారుల ఉత్తర్వులు పాటించక పోయినట్లయితే కేసులు నమోదై, ఇబ్బందులపాలు కావాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.

పట్టుబడిన సైలెన్సర్లు రోడ్డు రోలర్ తొక్కించిన ధ్వంసం:

ఈ మధ్యకాలంలో పట్టుబడిన శబ్దకాలుష్యానికి కారణం అయిన దాదాపు 400 వాహనాల సైలెన్సర్లను పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు, రవాణాశాఖ అధికారుల సమక్షంలో రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. వాహనాలు మెకానిక్ లు, ఆటోమొబైల్ దుకాణాల యజమానుల కళ్ళెదుట ఈ కార్యక్రమం నిర్వహించారు.

శబ్దకారణం అయ్యే సైలెన్సర్లను విక్రయించబోము:

శబ్దకాలుష్యానికి కారణం అయ్యే సైలెన్సర్లను నేటినుండి విక్రయించబోమని ఆటోమొబైల్ దుకాణాలు యజమానులు పోలీస్ కమీషర్ కు హామీ ఇచ్చారు. అలాగే మెకానిక్ లు శబ్దకాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను బిగించమని చెప్పారు.

First published:

Tags: Karimnagar, Local News, Telangana Police