Home /News /telangana /

RAJANNA SIRCILLA INTERESTING POLITICAL GAME BETWEEN CHENNAMANENI BROTHERS IN VEMULAWADA CONSTITUENCY RKH BRV PRV

Rajanna Sircilla: అన్నదమ్ముల మధ్య పోరు తప్పదా!: ఆసక్తిగా ఆ నియోజకవర్గ పాలిటిక్స్ 

చెన్నమనేని బ్రదర్స్​ మధ్య పోరు

చెన్నమనేని బ్రదర్స్​ మధ్య పోరు

అప్పుడు అబ్బాయి - బాబాయ్.. అనగా.. చేన్నమనేని రాజేశ్వరరావు కొడుకు అయిన చెన్నమనేని రమేష్ బాబు... చెన్నమనేని విద్యాసాగర్ రావు మధ్య పోటీ ఉండేది, ఇప్పుడు రమేష్ బాబు బాబాయ్ కొడుకు అయిన చెన్నమనేని వికాస్ రావు ఎంట్రీ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • vemu, India
    (K. Haribabu, News 18, Rajanna Sircilla)

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో చెన్నమనేని (Chennamaneni) కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చెన్నమనేని రాజేశ్వరరావు (Chennamaneni Rajeswar rao), విద్యాసాగర్ రావు (Vidhya sagar rao) ఇద్దరు అన్నదమ్ములు, రాజకీయ ఉద్దండులు. చెన్నమనేని రాజేశ్వరరావు క్విట్ ఇండియా ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, నిజాంపాలన వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఆయన..1957 సంవత్సరం నుంచి సిరిసిల్ల (Siricilla) నియోజకవర్గానికి 6 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక చెన్నమనేని విద్యాసాగర్ రావు మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ ప్రజాపతుల కమిటీ, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, మహారాష్ట్ర గవర్నర్‌గా (maharastra Governor) విద్యాసాగర్ రావు పనిచేశారు. అప్పుడు అబ్బాయి - బాబాయ్.. అనగా.. చేన్నమనేని రాజేశ్వరరావు కొడుకు అయిన చెన్నమనేని రమేష్ బాబు.. చెన్నమనేని విద్యాసాగర్ రావు మధ్య పోటీ ఉండేది. 2009లో రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వేములవాడ (Vemulawada) నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పుడు రమేష్ బాబు బాబాయ్ కొడుకు అయిన చెన్నమనేని వికాస్ రావు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో చెన్నమనేని కుటుంబంలో అన్నదమ్ముల (Brothers) పోరు తప్పదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

    నియోజకవర్గంలో బలమైన ముద్ర..

    వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని కుటుంబం వారసత్వం కొనసాగాలని  చెన్నమనేని వికాస్ రావును తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. కానీ ఎమ్మెల్యే రమేష్ బాబు తెరాస పార్టీ  (TRS) నుంచి బరిలో ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే రమేష్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రమేష్ బాబు బరిలో ఉంటే ఆయనే గెలుస్తాడంటూ తెరాస పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చెన్నమనేని వికాస్ రావు బిజెపి (BJP)నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా విద్యాసాగర్ రావు బీజేపీ పార్టీకి, ప్రజలకు సేవ చేసిన నేపథ్యంలో ఈవార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.



    డాక్టర్ వికాస్ రావు ప్రతిమా వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తూ...మండల కేంద్రంలోని ఆసుపత్రులకు అంబులెన్సులను ఉచితంగా అందజేస్తూ ఔదార్యం చాటుకున్నారు. దీంతోపాటు మహిళా సాధికారిక అనే అంశం మీద మహిళలకు కుట్టు మిషన్లు సైతం పంపిణీ చేసి సామాజిక సేవలో తన వంతు మార్కు చాటుకుంటున్నాడు. వికాస్ రావు వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో నియోజకవర్గ పరిధిలోని ఇప్పటికే పలు గ్రామాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు సైతం నిర్వహించాడు. కానీ ఆయన నుంచి మాత్రం రాజకీయ అరంగేట్రం ఉందని ఏ సమావేశాల్లో, ఏ సేవా కార్యక్రమాల్లో ప్రస్తావన తీసుకురాలేదు.

    ఆసక్తిగా అన్నదమ్ముల మధ్య పోరు:

    రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మంచి నేపథ్యం ఉన్న కుటుంబం కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్యాసాగర్ రావు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మెట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందగా, సీపీఐ పార్టీ నుంచి రాజేశ్వరరావు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇద్దరు ఒకే సంవత్సరంలోనే శాసనసభకు ఎన్నికవ్వడం విశేషం. ఇక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం కేసు కోర్టులో ఉంది. నియోజకవర్గంలో గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మూడవ స్థానంలోనూ, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే వికాస్ రావుకు బీజేపీ టికెట్ ఇస్తే అధికార తెరాస (TRS) పార్టీకి బలమైన ప్రత్యర్థి బీజేపీనే అవుతుందని రాజకీయ వారసత్వం కూడా కలిసివస్తుండడంతో బీజేపీకి మైలేజ్ వస్తుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో ఈ అన్నదమ్ముల మధ్య పోరు ఆసక్తిగా మారింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Telangana Politics, Vemulawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు