హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: ఇందిరమ్మ ఇండ్లు vs, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు.. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సవాల్

Rajanna Siricilla: ఇందిరమ్మ ఇండ్లు vs, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు.. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సవాల్

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్వేములవాడ అర్బన్ మండలంలోని 11 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఘనంగా సన్మానించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : హరి

లొకేషన్ : రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్వేములవాడ అర్బన్ మండలంలోని 11 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన అధ్యక్షుల ఎన్నిక

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఘనంగా సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతనఅధ్యక్షులు గ్రామ ప్రజల కష్టసుఖల్లో పాలుపంచుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గ్రామాలలో ప్రజల దీవెనలు పొందడానికి, ఎదురు పార్టీలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, పెరుగుతున్న డిజిల్, పెట్రోల్, వంట గ్యాస్, కరెంట్, బస్ చార్జీల వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజలకు వివరిస్తూ.. ఆనాడు పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో తెలియజేయాలని కోరారు.

ఆనాడు పేద ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే, ఈనాడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరించింది నిజం కాదాఅని ప్రశ్నించారు. గ్రామగ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు లేకుంటే తాము ఓట్లు అడగం, అదే గ్రామాలలో డబుల్ బెడు రూమ్ ఇండ్లు లేకుంటే మీరు ఓట్లు అడగవద్దు అంటూ బీఆర్ఎస్ నేతలకు సవాలు విసిరారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేసి, గరీబ్ హఠావోపేరిట పేద ప్రజలకు తిండి, నీడ, గుడ్డతో పాటు నిరుపేదలకు, దళితులకు భూమి లేని వారికి భూములు ఇస్తే ఈనాటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేసి కార్పోరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని నిరుపేద ప్రజలు, సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసి వారి కష్టసుఖల్లో పాలుపంచుకోవాలనేఉద్దేశ్యంతోనే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రుణమాఫీ పథకాలు తీసుకువచ్చాడని, ఎల్లంపల్లి ప్రాజెక్టు పేజ్-1, పేజ్-2 ద్వారా వేములవాడ ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు అందించేందుకు రూ.1750 కోట్లతో పనులు ప్రారంభించిన విషయం గుర్తుంచుకోండి అని పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై, సామాన్య ప్రజలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అనే విషయాన్నిప్రజల్లోకి తీసులువెళ్లి మరో 10 నెలలో జరిగే ఎన్నికలకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు సిద్ధంగా ఉండాలని కోరారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నాయత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు