హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండాలనుకున్నాడు, కానీ కడుపుకోత మిగిల్చాడు

Rajanna Siricilla: తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండాలనుకున్నాడు, కానీ కడుపుకోత మిగిల్చాడు

మలేషియాలో సిరిసిల్ల యువకుడు అనుమానాస్పద మృతి

మలేషియాలో సిరిసిల్ల యువకుడు అనుమానాస్పద మృతి

కష్టపడి పనిచేసి తల్లిదండ్రులను ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకున్నాడు ఆ యువకుడు. ఉన్న ఊరిలో ఉపాధి లేక..ఉపాధి కోసం మలేషియా (Malaysia) దేశం వెళ్లిన ఆ యువకుడు చివరకు కన్న వారికి కడుపుకోత మిగిల్చాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  Haribabu, News18, Rajanna Sircilla

  కష్టపడి పనిచేసి తల్లిదండ్రులను ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకున్నాడు ఆ యువకుడు. ఉన్న ఊరిలో ఉపాధి లేక..ఉపాధి కోసం మలేషియా (Malaysia) దేశం వెళ్లిన ఆ యువకుడు చివరకు కన్న వారికి కడుపుకోత మిగిల్చాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వంకాయల రాకేష్ మలేషియాలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వంకాయలు బాలలక్ష్మి, శ్రీనివాస్ దంపతులకు కొడుకు రాకేష్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్లకు వివాహం కాగా రూ. 12 లక్షల వరకు అప్పు అయింది. ఈ క్రమంలో తల్లిదండ్రులకు భారం కావద్దని రాకేష్ (22) ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలో ఈ ఏడాది జూలై 24న విజిట్ వీసాపై మలేషియా దేశం వెళ్లాడు.

  పని నుంచి తిరిగి రూంకు వచ్చిన రాకేష్ బాత్రూంలో జారపడ్డాడని, తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించామంటూ అతనితో పాటు గదిలో ఉండే ఇద్దరు యువకులు ఆగస్టు 12న రాకేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేష్ చికిత్స పొందుతున్న సమయంలో అతని తల్లిదండ్రులు.. స్థానిక ఆద్య గోలీ ఫౌండేషన్ చైర్మన్ గోలి మోహన్‌కు ఈ విషయాన్ని తెలియజేసారు. దీంతో గోలి మోహన్ సెప్టెంబర్ 19న రాకేష్ పరిస్థితిని తెలుసుకోగా, చిక్సిత సరిగా లేక, చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఘటన జరిగిన నాలుగైదు రోజులకే మృతి చెందినట్లు సమాచారం వచ్చింది.

  ఇది చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల దాడులు.. అసలు నిజం తెలిసి షాకైన అధికారులు

  రాకేష్ మరణవార్త అందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోలి మోహన్ తన సొంత ఖర్చులతో మలేషియా నుంచి రాకేశ్ మృతదేహాన్ని తెప్పించేందుకు కృషి చేస్తున్నారు. కాగా, శుక్రవారం రాకేశ్ మృతదేహం స్వగ్రామానికి రానున్నదని గ్రామ ప్రజలు, బంధువులు చెబుతున్నారు.

  కుమారుడి మృతిపై అనుమానాలు

  రాకేష్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన ఇద్దరు యువకులు రాకేష్ ‌తో కలిసి వెళ్లారని, వారే తమ కుమారుడిని చంపి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రూ.20 వేలు తీసుకొని పారిపోయారని ఆరోపిస్తున్నారు. ఆగస్టు 12న రాకేష్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నట్లు సమాచారం ఇచ్చి తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అందుబాటులోకి రాకపోవడం చూస్తే వారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు కుటుంబ సభ్యులు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Karimnagar, Local News, Telangana

  ఉత్తమ కథలు