Home /News /telangana /

RAJANNA SIRCILLA IN RESCUE OF HIS FAMILY A MAN DROWNED HIMSELF IN RAJANNASIRCILLA DISTRICT ABH BRV RKH

Rajanna Sircilla: భార్య, పిల్లలను కాపాడి నీటిలో మునిగి వ్యక్తి మృతి...

rajnna sircilla crime news

rajnna sircilla crime news

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పలు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లా కేంద్రం పరిధిలో మానేరు నదిలో మునిగిపోతున్న భార్యా పిల్లలను కాపాడిన ఓ వ్యక్తి తనకు ఈత రాక మునిగిపోయి మృత్యువాత పడ్డాడు. మర్రిపల్లికి చెందిన దేవయ్య (50) వ్యవసాయ బావిలో పడి మృతి

ఇంకా చదవండి ...
    (K.Hari babu, News 18, Rajanna Sircilla)

    రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పలు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లా కేంద్రం పరిధిలో మానేరు నదిలో మునిగిపోతున్న భార్యా పిల్లలను కాపాడిన ఓ వ్యక్తి తనకు ఈత రాక మునిగిపోయి మృత్యువాత పడ్డాడు. నదీ తీరాన ఆహ్లాదంగా గడిపి వద్దామనుకున్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం తారక రామనగర్‌కు చెందిన గున్నాల నరేశ్ (36) సారంపల్లి, బద్దెనపల్లి టెక్స్‌టైల్ పార్కులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం తన భార్య ఉమ, కుమారుడు కార్తికేయ(2), 6 నెలల పాప సహస్ర తో కలిసి తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్న వీరు, సాయంత్రం పక్కనే ఉన్న మానేరు నదిని చూసేందుకు వెళ్లారు. చెక్ డ్యామ్ వద్ద లోతు అంచనా వేయకుండా ఉమ తమ పిల్లలతో కలిసి నీటిలోకి దిగింది. వారు ముంగిపోతుండడం గమనించిన నరేష్ తనకు ఈత రాకపోయినా నీటిలోకి దూకి వారిని ఒడ్డుకు తోసి తాను నీట మునిగిపోయాడు. ఉమ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నరేష్ మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. కట్టుకున్నవాడు కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడంతో భార్య ఉమ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారందరూ కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ ఘటనపై తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తుపాకుల దేవయ్య (50) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో  పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం పొలంలో పనిచేస్తున్న దేవయ్య మంచి నీటి కోసం బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న వైరును గమనించని దేవయ్య ఆ వైరు కాలుకు చుట్టుకుని ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. రక్షించేందుకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో దేవయ్య నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య దేవవ్వ, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ బండ మల్లేశం, సర్పంచ్ కట్కం మల్లేశం సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, ప్రజా ప్రతినిధులు కోరారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు