హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: కంటి చూపు ఎట్లుంది పెద్దవ్వా!? మంత్రి కేటీఆర్ పకరింపు

Rajanna Siricilla: కంటి చూపు ఎట్లుంది పెద్దవ్వా!? మంత్రి కేటీఆర్ పకరింపు

ఆత్మీయ పలకరింపు

ఆత్మీయ పలకరింపు

Telangana: కంటి చూపు ఎట్లుంది పెద్దవ్వా.. పరీక్షలు చేసుకున్నారా? అంటూ మంత్రి కేటీఆర్.. కంటి పరీక్షల కోసం శిబిరాలకు వచ్చిన వృద్ధులతో ఆత్మీయంగా పలకరించారు. దూరం, దగ్గరి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా ఇస్తున్న కళ్లద్దాలు మన తెలంగాణలోనే తయారయ్యాయని వారికి చెప్పారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : హరి

లొకేషన్ : రాజన్న సిరిసిల్ల

కంటి చూపు ఎట్లుంది పెద్దవ్వా.. పరీక్షలు చేసుకున్నారా? అంటూ మంత్రి కేటీఆర్ .. కంటి పరీక్షల కోసం శిబిరాలకు వచ్చిన వృద్ధులతో ఆత్మీయంగా పలకరించారు. దూరం, దగ్గరి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా ఇస్తున్న కళ్లద్దాలు మన తెలంగాణలోనే తయారయ్యాయని వారికి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోనివీర్నపల్లి క్లస్టర్ రైతువేదికలో కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి కేటీఆర్ సోమవారం సందర్శించారు. శిబిరంలోని 5 కౌంటర్ లను, వాటి పనితీరు పరిశీలించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం ఎలా ఉంద‌ని ల‌బ్దిదారుల‌ను, స్పందన ఎట్లుంది అంటూ వైద్య సిబ్బందిని కేటీఆర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.

వృద్ధుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంద‌ని వారు కేటీఆర్‌కు వివ‌రించారు. కంటి వెలుగు శిబిరం వివ‌రాలు, ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు, కండ్ల‌ద్దాలు పంపిణీ చేశారనే విష‌యాల‌ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దృష్టి లోపాలను దూరం చేసేందుకే కంటి వెలుగు కార్యక్రమంను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని,కంటి వెలుగు శిబిరాలలో 18 సంవత్సరాలు నిండిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకుని కంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తీసుకువచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పనులు ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచాయని పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని, ఉద్యమ నేతనే సీఎం సీఎం కావడంతో తెలంగాణ అభివృద్ధి రంగంలో దూసుకెళ్తుందని అన్నారు. మ‌హాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని.. వీర్నపల్లి క్లస్టర్ రైతు వేదిక ముందు గాంధీ చిత్రపటానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి జాతిపిత చేసిన సేవలను స్మరించుకున్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు