హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: అర్ధనగ్నంగా ఇళ్లలోకి చొరబడుతున్న వ్యక్తులు .. లోపలికి వెళ్లి ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్

Rajanna Sircilla: అర్ధనగ్నంగా ఇళ్లలోకి చొరబడుతున్న వ్యక్తులు .. లోపలికి వెళ్లి ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్

(NUDE THIEVES GANG)

(NUDE THIEVES GANG)

Half naked gang: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు వెరైటీ గెటప్‌లతో చోరీలకు పాల్పడుతున్నారు. ఒకే రాత్రి ఆరు ఇళ్లలోని నగలు, నగదు మాయం చేశారు. చెడ్డీ గ్యాంగ్‌ తరహాలోనే ఉన్న ఈ దొంగలు సీసీ కెమెరాలకు చిక్కడంతో పోలీసులు వాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు.

ఇంకా చదవండి ...

  (K.Haribabu,News18, Rajanna sircilla)

  అర్ధ నగ్నంగా దుస్తులు, ముఖానికి మంకీ క్యాప్‌లు ధరించి దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే వీధుల వెంబడి హల్ చల్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా, ప్రస్తుతం తంగళ్లపల్లి మండల పరిధిలో సంచరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల(Rajannasircilla)జిల్లా తంగళ్లపల్లి (Tangallapally)మండల కేంద్రంలో శుక్రవారం(Friday)రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఆరు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పెద్ద మొత్తంలో నగలు, నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్(CCTV footage)ఆధారంగా దొంగల్ని పట్టుకునే పనిలో పోలీసులు (Police)బిజీగా ఉన్నారు.

  Telangana : లవ్ సక్సెస్ .. మ్యారేజ్ ఫెయిల్ .. అది తట్టుకోలేక వాళ్లిద్దరూ సూసైడ్  కొత్త గెటప్‌లో దొంగలు ..

  నిన్నటి వరకు నగరాలు, పట్టణాల్లో నివసించే వాళ్లను భయపెట్టిన చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు జిల్లాల్లోకి చొరబడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ను పోలినట్లుగా అర్ధనగ్నంగా ఉన్న కొందరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్లపల్లికి చెందిన పయ్యావుల ప్రవీణ్ ఇంట్లో రూ .55 వేల నగదు, 8 తులాల వెండి, దేవుడి గల్లాపెట్టెను ఎత్తుకెళ్లారు. తన భర్త గల్ఫ్ దేశం వెళ్లడానికి రెండు తులాల పుస్తెలతాడు బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చిన రూ.55 వేలను దొంగలు ఎత్తుకెళ్లారని ప్రవీణ్ భార్య పద్మ కన్నీరుమున్నీరుగా విలపించింది.

  ఆరు ఇళ్లలో నగదు,నగలు మాయం..

  మరో బాధితురాలు దాచరపు లక్ష్మి మహిళ ఇంట్లో దాచిన రూ .40 వేల నగదు, 10 తులాల వెండిని మాయం చేశారు ఈ వెరైటీ దొంగలు. తెలకపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లో 2 తులాల బంగారం, రూ .10 వేల నగదు, కోడం సత్యనారాయణ ఇంటిలో రూ.86 వేల నగదు, అరతులం బంగారం, 56 తులాల వెండి, మరికొన్ని ఇళ్లలోనూ నగదు చోరీకి పాల్పడ్డారు. తంగళ్ళపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, బ్లూ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. స్థానిక సీసీకెమెరాలు పరిశీలించిన పోలీసులు ఇద్దరు దుండగుల కదలికలు రికార్డ్ అయినట్లు గుర్తించారు. దుండగులు అర్ధనగ్నంగా తిరుగుతూ, భవన నిర్మాణాల్లో వాడే గ్లౌజులు చేతులకు వేసుకొని, ముఖాలు కనిపించకుండా మంకీ క్యాప్ వేసుకున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

  Crime News : కలకలం రేపుతున్న చీకోటి ప్రవీణ్‌ బర్త్‌ డే ఫోటోస్‌..చీకటి సామ్రాజ్యంలో వాళ్లూ భాగస్వాములేనా..  నయా స్టైల్‌లో చోరీ ..

  కొత్త తరహా చోరీలు జరుగుతుండడంపై పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, చోరీకి వచ్చిన వ్యక్తులను సులువుగా గుర్తించి వేగంగా పట్టుకునే అవకాశం ఉంటుందని పోలీసులు సూచించారు. మరోవైపు జిల్లా కేంద్రంలో తరచూ దొంగతనాలు జరగడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు అనునిత్యం పాట్రోలింగ్ చేస్తున్నారు. ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Siricilla, Telangana crime news

  ఉత్తమ కథలు