Home /News /telangana /

RAJANNA SIRCILLA GULF MIGRANT LABOURER DIED IN KUWAIT FAMILY URGE TO BRING THE DEADBODY ABH BRV RKH

Rajanna Sircilla: మాతృభూమిని ముద్దాడాలనుకున్నాడు.. కానీ... కువైట్‌కు ‘రాళ్లెత్తిన కూలీ..’ జీవితం ముగిసిందిలా..

కువైట్లో గుండెపోటుతో మృతి చెందిన గల్ఫ్ కార్మికుడు

కువైట్లో గుండెపోటుతో మృతి చెందిన గల్ఫ్ కార్మికుడు

పొట్టకూటి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన కార్మికుడు హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామ సమీపంలోని జైసేవాలాల్ భూక్యారెడ్డి తండాకు చెందిన భానోత్ గంగారం

    (K.Haribabu, News 18 , Rajanna Sircilla)

    పొట్టకూటి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన కార్మికుడు హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామ సమీపంలోని జైసేవాలాల్ భూక్యారెడ్డి తండాకు చెందిన భానోత్ గంగారం (54) 30 ఏళ్లుగా గల్ఫ్ దేశం కువైట్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా స్వదేశానికి తిరిగి రావాలని ప్రయత్నిస్తున్న గంగారం.. వీసా స్టాంపింగ్ ఆలస్యం కావడంతో ఆ దేశంలోనే ఉండిపోయాడు. ఈక్రమంలో ఆగస్ట్ 1వ తేదీన గంగారం గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన మిత్రులు అతన్ని కార్‌ లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారని మిత్రులు తెలిపారు. గల్ఫ్ కార్మికుడు గంగారం మరణ వార్త విన్న భార్య ప్రేమ, కొడుకులు గణేష్‌లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి గంగారం మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ ప్రమీల కోరారు.

    కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను చంపి ఆపై ఆత్మహత్యగా చిత్రించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. భేతీ శంకర్-చంద్రకళ దంపతులు సిరిసిల్ల పట్టణంలోని భవనఋషి నగర్లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మూడు రోజుల క్రితం (జులై 31న) భర్త శంకర్, చంద్రకళను తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తాడుతో ఇంటి పైకప్పుకు ఉరివేసి, వేలాడదీసి పారిపోయాడు. మృతురాలి కొడుకులు బతుకుతెరువు కోసం వేరే ప్రాంతంలో జీవిస్తున్నారు. ఈక్రమంలో జూలై 31 నుంచి ఫోన్ ద్వారా తమ తల్లితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనుమానం వచ్చిన కొడుకులు పొరుగింటి వారికీ ఫోన్ చేసి అమ్మను పిలవాలని కోరారు. ఈ క్రమంలో సదరు మహిళ వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. కిటికీలోంచి చూడగా చంద్రకళ ఇంటి పైకప్పుకు వేలాడుతుండడం గమనించి వారి కుమారులకు విషయం తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు