Home /News /telangana /

RAJANNA SIRCILLA GULF IMMIGRANT WORKER FROM KONARAOPET MANDAL DIED IN IRAQ RKH BRV ABH

Rajanna Sircilla: ఎన్నో ఆశలతో గల్ప్ వెళ్లిన కార్మికుడు... శవమై ఇంటికి వస్తాడని ఊహించని కుటుంబ సభ్యులు

స్వగ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం...రోదిస్తున్న కుటుంబ సభ్యులు

స్వగ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం...రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఉన్న ఊరిలో ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించేందుకు ఎన్నో ఆశలతో గల్ప్ దేశానికి వెళ్లిన వలస కార్మికుడు, శవమై శవపేటిలో ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోధన వర్ణనాతీతంగా మారింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తలో  చోటుచేసుకుంది

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    ఉన్న ఊరిలో ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించేందుకు ఎన్నో ఆశలతో గల్ప్ దేశానికి వెళ్లిన వలస కార్మికుడు, శవమై శవపేటిలో ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోధన వర్ణనాతీతంగా మారింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తలో చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎనగంటి దేవరాజు (33) గత కొన్నేళ్లుగా ఇరాక్ దేశంలో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం సెలవుపై ఇంటికి వచ్చి తిరిగి వెళ్లాడు. ఈక్రమంలో జూలై 9న బక్రీద్ సందర్భంగా దేవరాజు సహా.. కంపెనీలో పని చేస్తున్న 40 మంది తోటి కార్మికులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ఉన్న పెద్ద కొలనులో స్నానం చేసేందుకు దేవరాజు దిగగా, లోతు అంచనా వేయక నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. మరో వారం రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాడనుకున్న తమ భర్త.. ఇలా శవమై వస్తాడని ఊహించలేకపోయామని దేవరాజు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దేవరాజు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతదేహం గురువారం ఇంటికి చేరగా.. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. మృతునికి భార్య లాస్య, కూతుళ్లు అన్విత (8), మనస్విని (3), తల్లి లచ్చవ్వ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

    వేములవాడ ములవాగులో పడి ప్రమాదవశాత్తుపడి రిటైర్డ్ ఉద్యోగి మృతి
    వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్ చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి శివ బ్రహ్మచారి (59) మూలవాగులో పడి మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ బ్రహ్మచారి ఆగష్టు 3న రాత్రి 8 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు మూలవాగు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో పడి పోయాడు. అర్ధరాత్రి వరకు శివ ఇంటికి చేరకపోవడంతో కుమారుడు నాగరాజు... తండ్రి కోసం చుట్టుపక్కల గాలించాడు. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మూలవాగులో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొన్న పోలీసులు..బాధిత కుటుంబ సభ్యులను పిలిపించి మృతుడు శివ బ్రహ్మచారిగా గుర్తించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు