హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: నిర్మిస్తే సరిపోదు.. రోడ్లు కూడా వేయాలిగా.. రాజన్న జిల్లాలో వింత పరిస్థితి..

Rajanna Siricilla: నిర్మిస్తే సరిపోదు.. రోడ్లు కూడా వేయాలిగా.. రాజన్న జిల్లాలో వింత పరిస్థితి..

వేములవాడలో

వేములవాడలో సౌకర్యాలు లేని వైకుంఠ ధామాలు

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం (TS Government) ఏర్పడినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే ఆ అభివృద్ధి కార్యక్రమాలు అరకొరగా సాగడంతో ప్రజలకు ఇబ్బందులూ తప్పడం లేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం (TS Government) ఏర్పడినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే ఆ అభివృద్ధి కార్యక్రమాలు అరకొరగా సాగడంతో ప్రజలకు ఇబ్బందులూ తప్పడం లేదు. గ్రామాల పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామల నిర్మాణాలు పూర్తయినా అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా మారిపోతున్నాయని చెబుతున్నారు ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని 11 గ్రామాల్లో శ్మశానవాటికలు నిర్మించారు. ఒక్కో శ్మశానవాటికకు ఉపాధిహామీ నిధుల నుంచి రూ.12.60 లక్షలు నిధులు మంజూరు చేశారు. పనులు పూర్తయినా వాటి బిల్లులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు సౌకర్యం పూర్తిగా లేకపోవడంతో నిరుపయోగం కొడుముంజ గ్రామ వైకుంఠధామం దర్శనమిస్తుంది. పనులు పూర్తయి 15 నెలలు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు.

  స్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వైకుంఠధామనికి నాంపల్లి, బొజ్జపల్లి నుంచి తిరిగి వెళ్లాలంటే 7 కిలోమీటర్లు నడవాలి. అయితే మృతదేహాలతో తమ గ్రామం గుండా వెళ్లవద్దంటూ గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే దారిలేక..ఆ వైకుంఠధామం ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. అదే రెవెన్యూ అధికారులు, కొడుముంజ గ్రామం నుంచి పక్కన ఉన్న శాలరామన్నపల్లె గ్రామస్తుల సమన్వయంతో దారి చేసుకుంటే గ్రామానికి వైకుంఠ ధామానికి కిలోమీటర్ దూరం ఉంటుందంటున్నారు.

  ఇది చదవండి: బస్ స్టాప్ ఉంది కానీ రోడ్డు.., 60 ఏళ్లుగా రోడ్డు లేక ఏజెన్సీ గ్రామస్థుల అవస్థలు

  కొడుముంజ గ్రామ శ్మశాన వాటిక పనులు పూర్తయ్యాయి..కానీ రోడ్డు సౌకర్యం పూర్తిగా లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని సర్పంచ్ కదిరే రాజు అన్నారు. ఉన్న ఊరిలో కాకుండా ముంపులో మునిగిన పాత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించుకోవడం జరుగుతుందని, ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు చెబుతున్నారు. 15 నెలలు గడుస్తున్నా కూడా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతిమయాత్ర, దహన సంస్కారాలు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు, తహశీల్డార్ల దృష్టికి తీసుకెళ్లామని ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Vemulawada

  ఉత్తమ కథలు