Home /News /telangana /

RAJANNA SIRCILLA GRANDSON TRIES TO MURDER GRANDMOTHER FACES THREE YEAR SENTENCE RKH BRV ABH

Rajanna Sircilla: అమ్మమ్మను హత్య చేసేందుకు కుట్ర: కటకటాల పాలైన యువకుడు

అమ్మమపై  హత్యాయత్నం.. కేసులో మనవడికి జైలు

అమ్మమపై  హత్యాయత్నం.. కేసులో మనవడికి జైలు

చెడు వ్యసనాలకు బానిసై, అమ్మమ్మ వద్ద ఉన్న సొమ్ము కాజేయాలని చివరకు ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో మనవడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ తీర్పు వెల్లడించారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    చెడు వ్యసనాలకు బానిసై, అమ్మమ్మ వద్ద ఉన్న సొమ్ము కాజేయాలని చివరకు ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో మనవడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ తీర్పు వెల్లడించారు. పోలీసుల కధనం ప్రకారం..సిరిసిల్లలోని విద్యానగర్ చెందిన దాస్యం సంతోష్ అనే యువకుడు కొన్నాళ్లుగా చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ నేపద్యంలో తన అమ్మమ్మ అనసూర్య వద్ద ఉన్న డబ్బులను కాజేయాలని భావించాడు. ఈక్రమంలో గతేడాది జూలై 13న ఆమెపై దాడి చేసి, హత్యకు యత్నించాడు. గుర్తు తెలియని వ్యక్తులు చేశారని నమ్మించేందుకు ప్రయత్నించాడు. గాయపడిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ 2 రోజుల చికిత్సతో స్పృహలోకి వచ్చిన అనసూర్య తనపై దాడి చేసింది మనవడు సంతోష్ అని కుటుంబ సబ్యులకు చెప్పింది.

    వారు ఈ విషయాన్ని సిరిసిల్ల సీఐ అనిల్ కుమార్‌కు చెప్పడంతో.. ఆయన దాడి జరిగిన స్థలానికి వెళ్లి, ఆధారాలు సేకరించారు. ఆస్పత్రికి వెళ్లిన పోలీసులు జరిగిన వ్యవహారంపై వృద్ధురాలితో మాట్లాడారు. ఈక్రమంలో అనసూర్య కూతురు కళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సంతోష్‌ను అరెస్టు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు నడిచే క్రమంలో కోర్టు కానిస్టేబుల్ నరేష్ , సీఎంఎస్ శంకర్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి శ్రీలేఖ కేసు పూర్వాపరాలు పరిశీలించి, నిందితుడు సంతోష్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ .1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 30 రోజుల సాధారణ జైలుశిక్ష కొనసాగించాలని తీర్పులో పేర్కొన్నారు.

    డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్సై శేఖర్
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, గొల్లపల్లి శివారులో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశామని, సరైన ధ్రువ పత్రాలు లేనివారికి జరిమానా విధించామని ఎస్సై చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు నియంత్రిత వేగంతో ప్రయాణించాలని ఉన్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు