హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ ఎక్కడ చూసినా కంపు కంపే!..

ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ ఎక్కడ చూసినా కంపు కంపే!..

X
ప్రభుత్వ

ప్రభుత్వ కార్యాలయంలో కన్పించని టాయ్ లేట్ లు

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయ సముదాయాల పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో.. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయ సముదాయాల పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో.. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్ లేకపోవడంతో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.. స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అధికారుల కార్యాలయాల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైతం విద్యార్థులకు (బాలురు) టాయిలెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యార్థులు మండల ప్రజా పరిషత్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు.

దీంతో ఆ ప్రాంతమంతా పరిశుభ్రంగా మారి దర్శనమిస్తుస్తోంది. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు సైతం సరైన పర్యవేక్షణ లేక అధ్వానంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పబ్లిక్ టాయిలెట్స్ తో పాటు, త్రాగునీటిని ఏర్పాటు చేసి కార్యాలయాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టణ ఎమ్మార్వో, మండల ప్రజా పరిషత్, ఆర్డబుల్యుఎస్,ఐసీబీఎస్, ఫారెస్ట్ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం సోచనీయం. వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షన్ అమలు కావడంలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇప్పటికీ డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస రోడ్లు లేవని ప్రజలు వాపోతున్నారు.

సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు మండల ప్రజా పరిషత్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల ప్రాంతాల్లో మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.

మూత్రశాల లేకపోవడంతో మండల పరిషత్ ప్రాంతాల్లో దుర్గంధం వేదజల్లుతోంది. మండల పరిషత్ కు సమీపంలో ఉన్న సినారే కళామందిరం మందుబాబులకు అడ్డాగా మారింది. సినారె కళామందిరం స్థానంలో నూతనంగా నిర్మాణం చేపట్టేందుకు నిధులు మంజూరు అయినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పనులు ముందుకు సాగనీయడం లేదు. కార్యాలయం ఆవరణలో శిథిలావస్థకు చేరుకున్న భవనాల సైతం ఉన్నాయి.

First published:

Tags: Local News, Rajanna sircilla, Telangana

ఉత్తమ కథలు