తెలంగాణ(Telangana)లో హరితహాతం ఓ యజ్ఞంలా సాగిపోతోంది. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయాలని కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు గ్రీన్ ఛాలెంజ్ (Green Challenge)కార్యక్రమం దోహదపడుతోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల మధ్యలోనే మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి(Excise Minister )శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud). మహబూబ్‌నగర్ Mahabubnagarజిల్లాలో చరిత్రకు సాక్ష్యంగా వందల ఏళ్లుగా స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ప్రకృతి ఆస్తిగా భావించే భారీ వృక్షాలను రీ ట్రాన్స్ లొకేషన్ (Re trans location)పేరుతో తిరిగి నాటించారు. ఈ అద్భుతమైన కార్యక్రమం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు(KCR Urban Eco Park)లో నాటారు.
భారీ చెట్లకు పునర్జన్మ..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఉన్న వందల ఏళ్లుగా ఉన్న నాలుగు భారీ వృక్షాలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త , టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ సహకారంతో భారీ యంత్రాలతో పెద్ద వృక్షాలను రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా జాగ్రత్తగా తరలించి..కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌లో నాటించారు.
Development without causing any harm to Mother Nature. Appreciate the efforts of Minister @VSrinivasGoud garu, @Collector_MBNR garu and @vata_foundation for their efforts to traslocate these age old neem #Trees to Kcr-Eco park. Kudos to the commitment👍.#GreenIndiaChallenge 🌱 pic.twitter.com/me2KHmGWxL
— Santosh Kumar J (@MPsantoshtrs) April 17, 2022
చెరిగిపోని వందేళ్ల వృక్ష చరిత్ర..
మహబూబ్‌నగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈక్రమంలోనే అక్కడ ఉన్న వంద సంవత్సరాలకుపైగా ఉన్న నాలుగు భారీ వృక్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా వాటిని జాగ్రత్తగా మరోచోట నాటడం వల్ల స్థానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలిని ఇస్తూ వందల ఏళ్లుగా చరిత్రకు చిహ్నాలుగా నిలిచిన చెట్లను కాపాడేందుకు ప్రభుత్వం ఈ విధంగా చొరవచూపడం అభినందనీయమన్నారు.
అద్భుతమైన కార్యక్రమం..
ఈ భారీ వృక్షాల రీ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమం మంత్రి, ఎంపీతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు నేతృత్వంలో విజయవంతంగా జరిగింది. ట్రాన్స్ లోకేషన్ చేసిన చెట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా భారీ వృక్షాలను దగ్గరుండి తరలించిన ప్రజారోగ్య ఈ ఈ విజయ భాస్కర్‌తో పాటు ఇంజనీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.