కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి మంత్రి కేటీఆర్ (Minister KTR) శుభవార్త చేప్పారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్లను రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులకు ఇవ్వాలని కేటీఆర్ (Minister KTR) సూచించారు. ఇక సొంత స్థలం ఉండి కూడా ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ డబ్బును డిసెంబర్ నుండే ఇవ్వబోతున్నట్టు కేటీఆర్ (Minister KTR) వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ పథకం పంపిణీపై చర్చించారు. ఈ క్రమంలో పథకానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పురోగతి, మన ఊరు - మన బడి కార్యక్రమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారు. @TelanganaCMO @IPRTelangana pic.twitter.com/0ZcddbZX0D
— CollRajannaSircilla (@Collector_RSL) November 29, 2022
ఇప్పటి వరకు ఇళ్లు కట్టించి ఇచ్చి..
తెలంగాణ సర్కార్ రెండు పడకల ఇళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నిరుపేదలకు ఇళ్లు కట్టించి లబ్దిదారులకు కేటాయిస్తుంది. ఈ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుండగా..కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారి కల ఈ పథకంతో తీరుతుంది. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా సామాజిక వర్గాల వారిగా ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని గ్రామాల్లో ఇండ్లు నిర్మాణం చేసి లబ్దిదారులకు కేటాయించారు. మరికొన్ని గ్రామాల్లో ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్దిరోజుల్లో ఇవి పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వనున్నారు.
ఇల్లు కాకుండా డబ్బులు..రూ. 3లక్షలు..
ఈ ఇండ్ల నిర్మాణంలో ప్రజల నుండి అనేక ఆరోపణలు వచ్చాయి. ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని ఇష్టం ఉన్నట్టు కాకుండా నిబంధనల పరిధి మేర మాత్రమే నిర్మించాలన్న అంశంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా..డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. సొంతంగా జాగ ఉండి ఇళ్లు లేని వారికి ఈ నగదును అందజేయనున్నారు. డిసెంబర్ నుండి లబ్ధిదారుల గుర్తింపు మొదలు కానున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లోగా పేదలందరికీ ఇండ్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.