రిపోర్టర్ : హరి
లొకేషన్ : సిరిసిల్ల
పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం ఇంటర్, గ్రాడ్యుయేట్ చదువుతున్న దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ దివ్యాంగుల సంక్షేమ వర్గానికి చెంది ఉండి 10వ తరగతి పాసైన వారు ఆదాయం సర్టిఫికెట్ తో మార్చి 31లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తిగా వివరాల కోసం 9490091770 సంప్రదించాలని సూచించారు.
ఉచిత కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ శిక్షణలో C లాంగ్వేజ్, డాట స్ట్రక్చర్, జావా పుల్స్టాక్ డెవలపర్ కోర్సులు నేర్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13, 14 తేదీల నుంచి జిల్లా గ్రంథాలయంలో దరఖాస్తులను అందజేయాలని, వివరాలకు 7075522671 నంబరులో సంప్రదించాలని సూచించారు.
EMRI, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో సేవలందిస్తున్న 108 అత్యవసర అంబులెన్స్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, (డ్రైవర్) పైలట్ జాబ్స్ కు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా 102,108,1962, ప్రోగ్రాం మేనేజర్ సలీం, రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆర్డినేటర్ ఇమ్రాన్ సయ్యద్ ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. మెడికల్ టెక్నీషియన్ కి BSC నర్సింగ్, GNM-B ఫార్మసీ, D-ఫార్మసీ, DMLT అర్హతలతో పాటు 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని, (డ్రైవర్) పైలట్ జాబ్స్ కు అప్లైచేసుకునే అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి కలిగి 23-35 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులని వెల్లడించారు.
పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ (Orginal Certificates) సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని ఈనెల14వ తేదీన (మంగళవారం) ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3గంటలలోపు రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని (New Bustand) బస్టాండ్ ఎదురుగా ఉన్న డా.సినారె కళామందిరంలో హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని పూర్తి వివరాల కోసం 9014151667 సెల్ నంబర్ కు సంప్రదించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Scholarship, Telangana