Home /News /telangana /

RAJANNA SIRCILLA GARBAGE AND SEWAGE COLLECTED ON ROADS AND WARDS OF VEMULAWADA RAJANNA SIRICILLA DISTRICT SNR RKH BRV

Rajannasircilla: కేటీఆర్ ఇలాకా.. లేటైతే జనం దవాఖాన్లలో చేరాల్సిందే!

(పడకేసిన

(పడకేసిన పారిశుధ్యం)

siricilla: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పారిశుధ్యం దుర్భరంగా తయారైంది. ఎక్కడ చూసినా డ్రైనేజి, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. సాక్షాత్తు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గ జిల్లాలోనే పారిశుధ్యం పడకేసింది.

ఇంకా చదవండి ...
    (K.Haribabu,News18, Rajanna siricilla)
    పట్టణ ప్రగతి అంటూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణాల అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే..క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం బిన్నంగా ఉంటున్నాయి. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం, పాలకవర్గాలు కట్టుబడి ఉన్నా..కిందిస్థాయిలో సమీక్షలు కొరవడి అభివృద్ధి శూన్యంగా కనిపిస్తుంది. రాజన్నసిరిసిల్ల(Rajanna siricilla)జిల్లా వేములవాడ(Vemulawada)పట్టణంలో పారిశుధ్యం దుర్భరంగా తయారైంది. ఎక్కడ చూసినా డ్రైనేజి(Drainage), చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. సాక్షాత్తు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్(KTR) సొంత నియోజకవర్గ జిల్లాలోనే పారిశుధ్యం పడకేసింది.

    వేములవాడ పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత:
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో పారిశుధ్యం అటకెక్కింది. పట్టణంలో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరి పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం సమీపించిన తరుణంలో పట్టణంలో డ్రైనేజీ మరియు సిసి రోడ్లు నిర్మాణం లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి, జనావాసాల్లోకి నీరు చేరుతుంది. వర్షపు నీరు, మురికి నీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లోకి సైతం మురికినీరు చేరి, దోమల వ్యాప్తి అధికంగా ఉంటోందని, తద్వారా అనారోగ్యానికి గురవుతున్నామని వేములవాడ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సీజన్ వ్యాధుల నివారణకు వార్డుల శుభ్రతకు కృషి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

    Mulugu : ఆరేబియన్ బిర్యానీ రుచి చూడాలంటే..ములుగు ఏజెన్సీలోని అరబ్ మండీని విజిట్ చేయాల్సిందే



    సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి ప్రజల డిమాండ్:
    వేములవాడ పట్టణంలో జనాభా పెరిగిపోతున్నారు. పట్టణ విస్తీర్ణం నానాటికీ పెరిగిపోతుంది. పెరుగుతన్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేక పోవడం సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల ప్రాంతాలతో పాటు పలు వార్డులలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందుల గురయ్యామని పట్టణవాసులు పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి లేకపోగా, ఓపెన్ డ్రైనేజిలో పూడిక చేరి మురుగు నీరు నిల్వ ఉంటుందని, తద్వారా దోమలు వ్యాపించి రోగాలు భారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం సమీపించిన తరుణంలో ముందస్తుగా డ్రైనేజీలు, కల్వర్టులు శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

    పరిష్కారమార్గం ఏది:
    డ్రైనేజీల్లో పూడిక తీసి రోడ్లపై గుంతలు పూడ్చి వర్షపు నీరు నిలవకుండా చూడాలని సూచిస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కనీసం డ్రైనేజి కాల్వల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరుతున్నారు. పలు వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అద్వాన్నంగా తయారైందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో వార్డుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉందని, పలు వార్డులు ఇప్పటికే మురికి కూపాలుగా మారిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Kamareddy : మినరల్ వాటర్ ముట్టని గ్రామస్తులు .. అక్కడ ఇంటికో బావి ఉండటమే వాళ్ల సీక్రెట్


    అటకెక్కిన పట్టణ ప్రగతి, పట్టించుకోని అధికారులు, స్థానిక నేతలు:
    పట్టణాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చింది. మునిసిపల్ అధికారులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే వేములవాడలో పట్టణ ప్రగతి ప్రారంభమైన అధికారులు, స్థానిక నేతలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు స్వచ్ఛతకు మారుపేరుగా ఉండే వేములవాడ మున్సిపాలిటీ ఇప్పుడు చెత్తాచెదారం పేరుకుపోయి అధ్వానంగా దర్శనమిస్తుందని పట్టణవాసులు మండిపడుతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలోనైనా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వార్డులో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రజలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. పలు వార్డులలో సీసీరోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసినా పూర్తిస్థాయిలో పనులు పూర్తి కావడం లేదని ప్రజలు చెబుతున్నారు.

    స్దానికుల మనవి :
    వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని వేములవాడలో సీసీ రోడ్లు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు వార్డులను పరిశీలించి తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అద్వానంగా ఉన్న వార్డుల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వేములవాడ పట్టణంలోని వార్డులను సందర్శించాలని, త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తయ్యేలా మునిసిపల్ అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఇది చదవండి : ఆవు కడుపున వింత జంతువు .. వామ్మో అదే నిజం అంటున్న స్ఖానికులు


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు