హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: పల్లెలకు కూడా గంజాయి మత్తు: చిత్తవుతున్న యువత 

Rajanna Sircilla: పల్లెలకు కూడా గంజాయి మత్తు: చిత్తవుతున్న యువత 

గంజాయి కేసులు

గంజాయి కేసులు

పెద్ద సిటీలు, పట్టణాలకు పరిమితమైన మత్తుపదార్థాల వాడకం కాస్త పల్లెలకు విస్తరించింది. రాత్రి సమయాల్లో గ్రామాల శివారులను అడ్డగా చేసుకోని యువత మత్తు పదార్థాలను సేవిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (K. Haribabu,News18, Rajanna siricilla)

  ఇన్నాళ్లు పెద్ద సిటీలు (Cities), పట్టణాలకు (Towns) పరిమితమైన మత్తుపదార్థాల వాడకం కాస్త పల్లెలకు (Villages) విస్తరించింది. రాత్రి సమయాల్లో గ్రామాల శివారులను అడ్డగా చేసుకోని యువత మత్తు పదార్థాలను (Intoxicants)సేవిస్తున్నారు. బయటకు వెళ్లిన కొడుకులు అర్ధ రాత్రి దాటినా ఇంటికి రాకపోయినా తల్లిదండ్రులు మందలించకపోవడంతో యువకులు (Youngsters) మరింతా చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీంతో వారి బంగారు భవిష్యత్తు, జీవితం అంధకారం అవుతుంది. రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాలో జోరుగా గంజాయి సరఫరా సాగుతోంది. పోలీస్ శాఖ గంజాయి అక్రమ రవాణాను (Ganja Transport) అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పొరుగు జిల్లాల నుంచి గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. పోలీసుల కళ్లుగప్పి గంజాయి రవాణాలో కొత్త పుంతలు తొక్కుతున్నారు.

  గ్రామాల్లో యువకులు గంజాయి కొనుగోలు చేసే సమయంలో ఇతరులకు తెలియకుండా గంజాయిని 'శివప్రసాదం (Shiva Prasadam)' అనే కోడ్ పదంతో పిలుస్తున్నారు. ఎక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు పక్కనే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉండడంతో పాటు అటవీ ప్రాంతం కావడంతో రవాణా జోరుగా సాగుతోంది. అక్కడి నుంచి కోనరావుపేట మండలంలోకి యధేచ్చగా గంజాయి రవాణా సాగుతోంది. పోలీసులు నిత్యం వాహనాల తనిఖీలు చేస్తున్నప్పటికి యువత చేతికి మాత్రం గంజాయి చేరుతోంది.

  ఇటీవల కొలనూర్ (Kolanore) గ్రామంలోని రామన్నపేట  చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా అనుమానంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేశారు. వారి వద్ద 100 గ్రాముల గంజాయి లభించింది. గతంలో కోనరావుపేట గ్రామ శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో రోడ్డు మీద గంజాయి ప్యాకెట్లు, మామిడికాయ తొక్కుతో పాటు హుక్కా పోలీసులకు చిక్కాయి.

  మైనర్లు కావడంతో..

  పోలీసులకు గంజాయి ప్యాకేట్లతో పాటు హుక్కా దొరికినప్పటికీ మైనర్లు కావడంతో కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారనే ఆరోపణలు సైతం వినిపించాయి. పల్లిమక్త గ్రామ శివారులో గల చింతచెట్ల సమూహం, చెన్నకేశవ స్వామి ఆలయం వెనుక, విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఉన్న దారి వెంట, ధర్మారం గ్రామంలోని సత్యనారాయణ పల్లెలో, కొలనూర్ శివారుతో పాటు పాఠశాల వద్ద, చంద్రంపేట మర్తన్నపేట గ్రామ శివారులోని నాగరం గ్రామానికి వెళ్లే దారి వెంట యువత గంజాయి సేవించేందుకు అడ్డాలుగా మారాయి. గతంలో ధర్మారం గ్రామం నుంచి కనగర్తి గ్రామానికి వెళ్లే దారిలో పరుపుబడ్డ వద్ద గంజాయి సేవిస్తున్న యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. అదేవిధంగా కనగర్తి గ్రామంలో ఒక్కరు గంజాయి సరఫరా చేసి, యువతను మత్తులోకి దింపుతున్నట్లు సమాచారం.

  Thieves: దొంగల వింత డిమాండ్​.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?

  సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో గంజాయి అక్రమ రవాణా చేయకుండా గట్టి నిఘాను ఏర్పాటు చేశామని ఎస్సై రమాకాంత్ అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వారి సమయాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. యువత పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు.

  తల్లిదండ్రులు సైతం బాధ్యత తీసుకొని వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచినప్పుడే యువత సన్మార్గంలో నడిచే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. రాత్రి పూట రోడ్లపై యువకులు సంచరించకుండా డీజేలు, పార్టీలు, బర్త్ డే వేడుకలు నిషేధించి లేట్ నైట్ పార్టీలకు అనుమతులు నిరాకరించినప్పుడే యువత చెడు మార్గాలకు వెళ్లకుండా కొంతవరకు కట్టడి చేయవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ganja case, Local News, Police Case, Sircilla

  ఉత్తమ కథలు