(K.Haribabu,News18, Rajanna siricilla)
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు హెల్త్ క్యాప్ ను సద్వినియోగం చేసుకున్నారు. పరీక్షించిన అనంతరం ఫ్రీగా మెడిసిన్స్ సైతం అందించారు.
వేములవాడ పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు, రాజన్న సిరిసిల్ల IMA (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) వైద్యుల సహకారంతో వేములవాడలో ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు యశోద హాస్పిటల్స్ వారు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు, క్యాంపు ఆర్గనైజింగ్ చైర్మన్ శ్రీధర్ న్యూస్ 18తో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి మేనేజ్మెంట్ ను కండక్ట్ చేయాలని కోరిన వెంటనే స్పందించి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలుతెలిపారు.
ఈ హెల్త్ క్యాంపుకు 400 నుంచి 550 మంది వరకు వచ్చినట్లు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల సైతం హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత నాణ్యమైన మెడికల్ క్యాంప్ ను నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ వారికి యశోద హాస్పిటల్స్ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు.
ముందుగానే రోగ నిర్దారణ చేసుకుంటే దానికి తగిన వైద్యం అందించుకునే అవకాశం రావడం ద్వారా ప్రాణాలు కాపాడుకోగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఎవరు కూడా ఆరోగ్యంపై ఆశ్రద్ద వహించవద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలలో వేములవాడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. క్యాంపుల ద్వారా ఎంతోమంది ప్రాణాలను రక్షిస్తూ.. ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ వహించాలో వైద్యులు ప్రజలకు వివరించడం, ఆహార అలవాట్లు తదితర అంశాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని గుర్తు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla, Telangana