హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఒక్కరోజు..నాలుగు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు..ప్రభుత్వాసుపత్రి వైద్యుల సేవలు భేష్!

ఒక్కరోజు..నాలుగు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు..ప్రభుత్వాసుపత్రి వైద్యుల సేవలు భేష్!

knee operations

knee operations

వేములవాడ ఏరియా దవాఖానలో ఒకేరోజు నాలుగు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుల సహకారంతో రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India

రిపోర్టర్ : హరి

లొకేషన్ : సిరిసిల్ల

వేములవాడ ఏరియా దవాఖానలో ఒకేరోజు నాలుగు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశామని వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుల సహకారంతో రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్..పట్టుకున్న పోలీసులు..ఎక్కడంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలో ఫాజల్ నగర్ గ్రామానికి చెందిన చిందం వీరవ్వ వయసు (62), మెట్పల్లి మండలంలో మసాయిపేట్ గ్రామానికి చెందిన కట్టే పెద్ద లక్ష్మి(56), కథలాపూర్ మండలంలోని బొమ్మన గ్రామానికి చెందిన జుంబారాతి చిన్న నరసయ్య(55), కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన ఇస్లావత్ చంద్రు(74) మోకాలు సంబంధించిన జబ్బుతో బాధ బాధపడుతూ వేములవాడ నియోజకవర్గ పరిధిలో తిప్పాపురం ప్రాంతంలో ఏర్పాటు చేసిన 100 పడకల ఏరియా ఆస్పత్రికి వచ్చారు.

దీంతో సదరు రోగులను పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి మోకాలు కీలు మార్పిడి చికిత్స అవసరమని గుర్తించామని వైద్యులు చెప్పారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా వేములవాడలోని ఆస్పత్రిలో ఈ చికిత్సను పూర్తిగా ప్రభుత్వం సహకారంతో ఉచితంగా అందించడం జరిగిందని ఆసుపత్రి సూపరిండెంట్ రెగులపాటి మహేష్ రావు అన్నారు.

ఇన్‌కం ట్యాక్స్‌ రేట్లు సవరించే యోచనలో ప్రభుత్వం..? లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే..

కార్పొరేటు ఆసుపత్రికి దీటుగా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వేములవాడ పట్టణంలోని తిప్పపురం ప్రాంతంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబుల సహకారంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆసుపత్రి అతి తక్కువ సమయంలోనే కాయకల్ప అవార్డు సైతం అందుతుందని గుర్తు చేశారు. సాధారణ ప్రసవాలపై, వాటి ఉపయోగాలను ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పిస్తూ.. ఏరియా ఆసుపత్రిలోని ప్రసవాలు అధికంగా జరిగే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో మొదటి కాన్పుగా ఆడపిల్ల జన్మిస్తే ఉచితంగా ఉయ్యాలను అందజేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కేటీఆర్ లు సైతం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయని అన్నారు.

ఈ శస్త్రచికిత్సలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేష్ రావు ఆధ్వర్యంలో వైద్య బృందం డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శశి, డాక్టర్ తిరుపతి , డాక్టర్ వెంకట్, స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి, అరుణ్ సాయి, కావ్య, ఓటి సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.

First published:

Tags: Local News, Rajanna sircilla, Telangana

ఉత్తమ కథలు