Home /News /telangana /

RAJANNA SIRCILLA FLOODS HEAVY RAIN DAMAGED ROADS AND BRIDGES IN RAJANNA SIRCILLA DISTRICT ABH BRV RKH

Rajannasircilla: మూలవాగుపై వంతెనలు, రోడ్లు పూర్తిగా ధ్వంసం: గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

మూలవాగుపై

మూలవాగుపై వంతెనలు, రోడ్లు పూర్తిగా ధ్వంసం

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఇటీవల సంభవించిన వరదలు అపార నష్టం కలిగించాయి. జిల్లా పరిధిలోని పలు గ్రామాల మధ్య రోడ్లు పూర్తి దెబ్బతిన్నాయి. వంతెనలు, రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

    (K.Haribabu, News 18, Rajannasircilla)

    రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఇటీవల సంభవించిన వరదలు అపార నష్టం కలిగించాయి. జిల్లా పరిధిలోని పలు గ్రామాల మధ్య రోడ్లు పూర్తి దెబ్బతిన్నాయి. మూలవాగుపై వంతెనలు, రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో నిత్యం ఇటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

    వర్షాల ధాటికి కొట్టుకుపోయిన కల్వర్టు:
    రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని విలాసాగర్ నుంచి కొదురుపాక వెళ్లే బిటి రహదారిలోని కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. దశాబ్దాల నాడు నిర్మించిన కల్వర్టు కావడంతో గతంలోనే పూర్తిగా శిథిలమై రాళ్ళు తేలాయి. గత సంవత్సరం కురిసిన వర్షాలకు సైతం కల్వర్టు కొట్టుకుపోగా రూ. కోటి 20 లక్షల నిధులతో కొత్త కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు పంచాయతీ రాజ్ ఏఈ పత్రికా ముఖంగా ప్రకటించారు. కానీ రూ. మూడు లక్షలతో పైపులు వేసి మొరం పోసి తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వర్టు పూర్తిగా దెబ్బతినింది. దీంతో ఈ రహదారి గుండా ప్రయాణించడానికి వీలు కావడం లేదని సమీప గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారంగా కొత్త కల్వర్టు నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. కోదురుపాక - విలసాగర్ ప్రధాన రహదారి కావడంతో నిత్యం ఏదో ఒక పనిపై ఇటుగా వచ్చే ప్రజలు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

    వర్షానికి కొట్టుకుపోయిన రహదారి, స్తంభించిన రాకపోకలు:
    రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కురిసిన భారీ వర్షాలకు చందుర్తి మండలం కొత్తపేట గ్రామానికి వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామం నుండి ఇతర ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గతేడాది కురిసిన వర్షాలకు రహదారి కొట్టుకుపోవడంతో గ్రామస్థులు శ్రమదానంతో రహదారి నిర్మించుకున్నారు. అయితే ఈ ఏడాది కూడా భారీ వర్షాలకు రహదారి కొట్టుకుపోవడంతో కొత్తపేట గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు కనీసం కాలిబాట కూడా లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి దెబ్బతిన్న రహదారికి తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ పిట్టల లాస్య డిమాండ్ చేశారు.

    బండపల్లి గ్రామంలో ఊర చెరువు పూర్తి స్థాయిలో నిండి మత్తడి పారుతోంది. బండపల్లి - బావుసాయిపేట గ్రామాల మధ్యనున్న కల్వర్టు పై నుండి వరద ప్రవహిస్తుంది. దీంతో ఈమార్గంలో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం భారీ వర్షాల కారణంగా పరిస్థితి ఇలాగే ఇబ్బందిగా ఉంటోందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నేతలు స్పందించి బావుసాయిపేట - బండపల్లి గ్రామాల మధ్య కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

    జిల్లాలోని వెంకట్రావుపేట, బావుసాయిపేట, కొండాపురం గ్రామాల శివారులోని మూలవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగు పరివాహకంలోని మూడు గ్రామాలకు ఉపయోగకరంగా ఉన్న వంతెన ధ్వంసం అయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట గ్రామ శివారులోని నక్కవాగు... చిన్నపాటి వర్షాలకే ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇటుగా వచ్చే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని నక్కవాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Floods, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు