హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతున్న వరి ధాన్యం.. మందు డబ్బాలతో రైతుల నిరసన

Rajanna Sircilla: కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతున్న వరి ధాన్యం.. మందు డబ్బాలతో రైతుల నిరసన

X
నిరసన

నిరసన చేపట్టిన రైతులు

Rajanna Siricilla: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతున్న వరి ధాన్యం..మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన రైతులు.దీంతో వేములవాడ - కోరుట్ల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu, News18, Rajanna siricilla

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతున్న వరి ధాన్యం..మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన రైతులు.దీంతో వేములవాడ - కోరుట్ల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,మంత్రి కేటీఆర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని ధాన్యం కొనుగోల్లో వేగం పెంచాలని కోరారు.

రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ మద్దతు తెలిపారు. రైతుల కోసం తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని గొప్పలు చెప్పుకోవడం తప్పా ఏం లేదని విమర్శించారు.రైతులు రొడ్లెక్కితే గానీ రైతుల సమస్యలు ప్రభుత్వాన్ని గుర్తుకు రావా అని ప్రశ్నించారు రైతులు.. రైతుల అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేసినప్పుడే రైతుల కష్టాలు తీరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ధాన్యం బస్తాలు తరలించడం ఆలస్యం అవుతుందని అలాగే 42 కిలోలు తూకం వేస్తాం అని చెప్పి 43 కిలోలు తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందు డబ్బాలతో రుద్రంగి రైతులు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..42 కిలోలకే ధాన్యం తూకం వేస్తాం అని చెప్పి 43 కీలోలు జోకుతూ ఆరుగళం కష్టపడి పండించిన రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే కొందరి రైతుల ధాన్యం తూకం వేసి వారం గడుస్తున్నా ఇప్పటికి తరలించడం లేదని అన్నారు.మళ్ళీ పంటలు వేసే సమయం దగ్గర పడ్డప్పటికి కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటం పై ధర్నా నిర్వహించామని అన్నారు.మండల అధికారులు జిల్లా అధికారులు స్పందించి ధాన్యం త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని అలాగే 42 కిలోలకే తూకం వేయాలని రైతులు కోరారు.రైతులకు మద్దతుగా చందుర్తి జడ్పిటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ...రైతులు ధాన్యన్నీ కళ్ళల్లో పోసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా తరలించకపోవడంపై ప్రభుత్వ పని తీరు ఏ విదంగా ఉందొ కనిపిస్తుందని అన్నారు.

రైతులు రోడ్డెక్కితేనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తార అని తెరాస ప్రభుత్వన్నీ ప్రశ్నించారు.ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా స్థలానికి ఎస్సై ప్రభాకర్ చేరుకొని సొసైటీ వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కరం చేస్తామని చెప్పటంతో రైతులు ధర్నా విరమించారు.ఈ కార్యక్రమంలో రైతులు సామ మోహన్ రెడ్డి,చెలుకల తిరుపతి ,పుట్కాపు మహిపాల్,పుట్కాపు రాజిరెడ్డి గంగం గంగారెడ్డి, సామ రాజు సామ సంతోష్ , సుమంత్, వినోద్ రెడ్డి, తిరుపతి, అరవింద్ ,భూమారెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు