Home /News /telangana /

RAJANNA SIRCILLA FARMER AXED 90 TODDY TREES IN TADAGONDA VILLAGE OF RAJANNASIRCILLA DISTRICT SNR RKH BRV

Rajannasiricilla : కల్లుగీత కార్మికుల కడుపు కొట్టిన రైతు ..90 తాటిచెట్లు నరకడంపై గౌడ సంఘాలు ఆగ్రహం

(కల్లుగీత

(కల్లుగీత కార్మికుల ఆవేదన)

Rajannasircilla : ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 90 తాటి చెట్లను నరికి వేశాడు ఓ రైతు. ఒక్కసారిగా 90 తాటి చెట్లు నరికివేతతో, తాటి కల్లు ద్వారా జీవనాధారం పొందుతున్న గీత కార్మికులు రోడ్డున పడ్డారు. ఈఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
    (K.Haribabu,News18, Rajannasiricilla)
    ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 90 తాటి చెట్లను నరికి వేశాడు ఓ రైతు. ఒక్కసారిగా 90 తాటి చెట్లు (Toddy-trees)నరికివేతతో, తాటి కల్లు ద్వారా జీవనాధారం పొందుతున్న కల్లు గీత కార్మికులు రోడ్డున పడ్డారు. ఈఘటన రాజన్నసిరిసిల్ల(Rajannasircilla)జిల్లా బోయినిపల్లి(Boinipalli)మండలం తడగొండ(Tadagonda)గ్రామంలో చోటుచేసుకుంది. రైతు చేసిన పనికి తమ ఉపాధిని కోల్పోయామని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    పొలం గట్టుపై ఉన్న తాటి చెట్లను నరికివేసిన రైతు:
    తడగొండ గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలం గట్టుపై ఉన్న 90 తాటి చెట్లను నరికి వేశాడు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా రైతు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల గ్రామంలోని గౌడ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాటి ,ఈత చెట్లను నరికితే చట్ట రిత్య చర్యలు తీసుకుంటామని చెప్తున్నా ఇవేవి పట్టకుండా ఆ రైతు ఏకంగా 90 చెట్లను నరికి వేశాడు. దీంతో తాటి కల్లు గీసుకుంటూ జీవనాదారం పొందుతున్న కులవృత్తుల వారు రోడ్డున పడ్డారు. అయితే, గట్టుపై ఉన్న తాటి చెట్ల నుంచి రాలుతున్న మట్టలు, తాటి కాయలు కారణంగా తన పొలం పాడైపోతుందనే కారణంతోనే రైతు ఇలా మొత్తం తాటి చెట్లను నరికి వేసినట్లు చెబుతున్నాడు. తాటి చెట్ల నరికివేతతో ఉపాధి కోల్పోయామని, రైతుపై చర్యలు తీసుకోవాలంటూ గౌడ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.

    ఇది చదవండి: ఆ అభయారణ్యం ప్రకృతి అందాలకు నెలవు.. ఒక్కసారి సందర్శించినా ఆ ఫీలింగే వేరు



    తాటి వనంపై ఆధార పడ్డ 40 కుటుంబాలు:
    తడగొండ గ్రామంలో గౌడ కులస్తులు తాటి, ఈత చెట్లపై ఆదారపడి జీవనాదారం పొందుతున్నారు. గ్రామంలో 40 వరకు గౌడ కుటుంబాలు కుల వృత్తిని నమ్ముకొని ఉన్నామని, అందరం గీత, కుల వృత్తిపైన ఆదారపడి జీవిస్తున్నామని, మాకు చెప్పకుండానే తాటి చెట్లు నరికివేయడంతో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు గౌడ కులస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 90 తాటి చెట్లను నరికి వేసిన రైతుపై సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తడగొండ గౌడ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈసందర్బంగా గౌడ కులస్తులు న్యూస్ 18తో మాట్లాడుతూ రైతు నరికిన 90 తాటి చెట్లలో 50 చెట్లకు కల్లు పారుతున్నాయని, చెట్ల నరికివేతతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక ఎక్స్ సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశామని, తాటి చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఇది చదవండి : నిన్న పనోడు.. నేడు ఓనరు : 'దళిత బంధు' పథకం తెచ్చిన మార్పు ఇదే!



    భాద్యులపై చర్యలు:
    ఈ ఘటనకు సంబంధించి న్యూస్ 18 ప్రతినిధి స్థానిక ఎక్సైజ్ సీఐని సంప్రదించగా, నరికి వేయబడిన తాటి చెట్ల పొలం.. ఆ రైతు భార్య పేరుపై పట్టా చేయబడి ఉందని, పూర్తి విచారణ అనంతరం భాద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా అక్రమంగా తాటి, ఈత చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు