హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: నాటుసారాపై పోలీసుల ఉక్కుపాదం.. పీడీ యాక్టు నమోదుకు రంగం

Rajanna Sircilla: నాటుసారాపై పోలీసుల ఉక్కుపాదం.. పీడీ యాక్టు నమోదుకు రంగం

రాజన్న సిరిసిల్ల క్రైం వార్తలు

రాజన్న సిరిసిల్ల క్రైం వార్తలు

వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన నాటు సారా విక్రేత నారాయణను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అతని నుంచి నాటుసారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్ ఎదుట బైండోవర్ చేశారు

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Haribabu, News18, Rajanna Sircilla) 

  రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన నాటు సారా  (Natu Sara) విక్రేత నారాయణను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అతని నుంచి నాటుసారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్ ఎదుట బైండోవర్ చేశారు. భవిష్యత్తులో సారా తయారీ, విక్రయాలు జరపకుండా రూ.లక్ష పూచికత్తు పత్రం రాయించుకుని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్సైజ్ సీఐ ఎంపీఆర్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నిషేధిత ఉత్పత్తులు గంజాయి, నాటుసారా తయారుచేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.అక్రమంగా నిషేదిత ఉత్పత్తులు తాయారు చేసేవారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

  ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

  ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లనుశనివారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు ఆర్ఎస్ఐ తెలిపారు. కొద్దిరోజులుగా మానేరు, నక్కవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. నామాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఆర్ఎస్ఐ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని ఉపేక్షించమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  Lovers Suicide: ప్రేమికురాలు పురుగుల మందు తాగిందని.. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియుడు.. అయితే చివర్లో షాక్​..

  గుండెపోటుతో కూలీ మృతి:

  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పద్మానగర్‌కు చెందిన హమాలీ కూలీ కామిలి మారుతి (35) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడికి భార్య సమత, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో దహన సంస్కారాలకు చిల్లిగవ్వ లేకపోవడంతోపలువురు స్వచ్చంద సేవకులు చందాలు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. కూలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Local News, Rajanna, Siricilla

  ఉత్తమ కథలు