Home /News /telangana /

RAJANNA SIRCILLA EVEN AFTER SIX YEARS OF STARTING MULAVAGU BRIDGE IS STILL UNDER CONSTRUCTION IN VEMULAWADA RKH BRV PRV

Rajanna Sircilla: వేములవాడ రాజన్న సన్నిధిలోనూ ఇలాగేనా? ఏళ్లుగా ఆ వంతెనను పట్టించుకున్న నాథుడే లేడు.

వేములవాడ

వేములవాడ రాజన్న ఆలయం (ఫైల్​)

వేములవాడలో ప్రజల అవసరాల దృష్ట్యా అప్పటికప్పుడు పనులు ప్రారంభించినా..అనుకోని ఆటంకాల వలన అభివృద్ధి పనులకు బ్రేక్ లు పడుతున్నాయి. అవాంతరాలు దాటుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లాల్సిన అధికారులు, స్థానిక నేతలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు

ఇంకా చదవండి ...
    (K. Haribabu, News18, Rajanna siricilla) 

    పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ప్రజల రవాణా కష్టాలు తీరుస్తూ ప్రభుత్వాలు కొత్త రహదారి నిర్మాణాలు చేపడుతుంటాయి. ఈ రహదారి మార్గాల్లో అడ్డొచ్చే నదులు, కాల్వలపై వంతెనలు నిర్మించి రవాణా మార్గాలను సులభతరం చేస్తుంది ప్రభుత్వం. అయితే ప్రజల అవసరాల దృష్ట్యా అప్పటికప్పుడు పనులు ప్రారంభించినా..అనుకోని ఆటంకాల వలన అభివృద్ధి పనులకు బ్రేక్ లు పడుతున్నాయి. అటువంటి అవాంతరాలు దాటుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లాల్సిన ప్రభుత్వశాఖల్లోని కొందరు అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నేతలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా నిలిచిపోతున్నాయి.

    ఏళ్లకేళ్లుగా మూలవాగు వంతెన నిర్మాణం..

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ  (Rajanna siricilla Vemulawada) మూలవాగు (Mulavagu)పై ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం ప్రారంభించిన బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2016లో రూ. 14 కోట్లతో శంకుస్థాపన గావించి నిర్మాణ పనులు ప్రారంభించారు. వేములవాడ రాజన్న (Vemulawada Rajanna) దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు ఇన్, అవుట్ రహదారులు ఉండాలన్న లక్ష్యంతో ఈ వంతెన పనులు ప్రారంభించారు. రెండు వంతెనలకు గానూ పనులు ప్రారంభించగా మొదటి బ్రిడ్జి నిర్మాణం (Bridge Construction) దాదాపు రెండేళ్లలో పూర్తి చేశాడు కాంట్రాక్టర్. అయితే పూర్తి చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వంతెనపై "ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని" ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అప్పట్లో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన అధికారులు కాంట్రాక్టర్ కు మొదటి విడత డబ్బులు చెల్లించారు. అప్పటి నుండి రెండో వంతెన పనులపై నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తున్నారు అధికారులు.



    గతంలో రెండు సార్లు కూలిన వంతెన..

    ఐదేళ్ల కిందట తలపెట్టిన వేములవాడ (Vemulawada) తిప్పాపూర్ బస్టాండ్ మూలవాగు బ్రిడ్జ్ పనుల్లో ఒకవైపు వంతెన పనులు పూర్తై.. వాహన రాకపోకలు కొనసాగుతుండగా..రెండోవైపు వంతెన నిర్మాణం పనులు ఎంత మాత్రం ముందుకు సాగడంలేదు. రెండో వంతెన నిర్మాణంలో ఉండగానే గతంలో రెండు సార్లు వచ్చిన వరద ప్రవాహానికి కూలిపోయింది. బ్రిడ్జి పనులు (Bridge Construction) జరుగుతున్న సమయంలోనే భారీ వరదలు రావడంతో వంతెన నిర్మాణంలో సపోర్టు కోసం ఉపయోగించిన సెంట్రింగ్ వరద ఉద్ధృతికి పక్కకు జరిగిపోవడంతో వంతెన కుప్పకూలింది. 2021 సెప్టెంబర్ లో వచ్చిన వరదలకు ఒకసారి, అంతక్రితం వచ్చిన వరదల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఏళ్లకేళ్లుగా సాగుతున్న వంతెన పనులు (Bridge Construction) ప్రతిసారీ నిర్మాణ దశలోనే కూలిపోవడం స్థానికులను అసహనానికి గురిచేస్తుంది.

    ఈ ఏడాది కూడా నత్తనడకనే పనులు..

    గతంలో రెండుసార్లు వంతెన కూలినా..పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచన అధికారుల్లో కనిపించడం లేదు. దీంతో రెండో బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈసారైనా పనులు వేగవంతం చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారని స్థానిక ప్రజలు భావిస్తుండగా..బ్రిడ్జి నిర్మాణం కోసం అమర్చిన సలాకను కాంట్రాక్టర్ ఆగమేఘాల మీద తొలగిస్తున్నారు. అయితే, అధికారుల మాత్రం అలాంటిదేమీ లేదని వర్షాకాలం మూలంగానే పనులు నిలిపివేస్తున్నారని, వర్షాకాలం ముగియగానే తిరిగి పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. వర్షాకాలం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో వంతెన నిర్మాణం (Bridge Construction) ఇలా ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కు వెళ్లడంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రెండో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి, వేములవాడ నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలు త్వరగా తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Rajanna, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు